Jagan వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ పాదయాత్ర ఏడాదిన్నర పాటు జరుగుతుందని.. ఆ ఏడాదిన్నర పాటు ప్రత్యక్షంగా ప్రజల మధ్యే ఉంటానని అన్నారు. ఈ ప్రకటన తర్వాత పార్టీలో నిజంగానే చేస్తారా? లేకపోతే ఇది కూడా 2024 జిల్లా టూర్‌లాగే ఆగిపోతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
జగన్ 2024 చివర్లో జిల్లాల వ్యాప్తంగా తిరుగుతానని చాలా సార్లు ప్రకటించారు. కానీ ఆయన ఈ టూర్ చేయకపోగా తాడేపల్లిలోని తన నివాసంలోనే ఉండిపోయారు. దాంతో కనీసం ఈ పాదయాత్ర అయినా నిజంగా చేస్తారా? అని చర్చ జరుగుతోంది.





