Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను గ్రీన్‌ల్యాండ్‌పై పడిన సంగతి తెలిసిందే. ఎలాగైనా డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోవాలని ప్లాన్ వేస్తున్నారు. అయితే.. అసలు ఈ గ్రీన్‌ల్యాండ్‌ని ఆక్రమించుకోవాలన్న ఆలోచన ట్రంప్‌ది కాదట. ఆయన బుర్రలో గ్రీన్‌ల్యాండ్ అనే విత్తనం నాటిన వ్యక్తి ఓ బిలియనేర్. అతనెవరో తెలుసా?
ఆ బిలియనేర్ పేరు రొనాల్డ్ లౌడర్. ప్రముఖ అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్ అయిన ఎస్తే లౌడర్ కంపెనీ అధినేతే ఈ రొనాల్డ్ లౌడర్. రొనాల్డ్, డొనాల్డ్ మంచి స్నేహితులు. రొనాల్డ్‌కి భౌగోళిక రాజకీయాలంటే మక్కువ కాస్త ఎక్కువే. అందుకే ట్రంప్ తొలిసారి అమెరికాకు అధ్యక్షుడు అయినప్పుడు గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోమని రొనాల్డ్ సలహా ఇచ్చారు. చిరకాల మిత్రుడు చెప్పాడంటే అందులో ఏదో లాభం ఉండే ఉంటుందని ట్రంప్ తన టీం చేత గ్రీన్‌ల్యాండ్‌పై రీసెర్చ్ చేయించాడు.
గ్రీన్‌ల్యాండ్స్‌ను సొంతం చేసుకుంటే అమెరికాకు లాభమే తప్ప నష్టమేమీ లేదని తెలీడంతో ఇప్పుడు ఆయన ఫోకస్ మొత్తం ఆ భూభాగాన్ని సొంతం చేసుకోవడంపైనే ఉంది. కాస్మెటిక్ సంస్థకు అధినేత అయిన రొనాల్డ్ లౌడర్‌కు గ్రీన్‌ల్యాండ్స్ వల్ల కలిగే లాభమేంటో తెలీదు కానీ ట్రంప్‌కు ఈ ఐడియా ఇచ్చింది మాత్రమే ఆయనే అని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.





