2026: మన హిందువుల సంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరం అంటే ఉగాది నుంచే మొదలవుతుంది. కానీ ఏడాది మొదలయ్యేది జనవరి 1న కాబట్టి.. అందరూ ఆ రోజునే కాస్త ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. రేపు 2026 సంవత్సరం మొదలుకానున్న సందర్భంగా ఏ రాశి వారు ఏ చేస్తే మంచిదో ఓసారి చూద్దాం.
మేష (Aries)
ఉదయాన్నే సూర్య భగవానుడిని స్మరించుకుంటూ నీరు సమర్పించండి.
వృషభ (Taurus)
పేద వారికి కానీ.. ఆలయంలోని భక్తులకు కానీ తెల్ల పదార్థాలు అంటే పెరుగన్నం, పాలు, స్వీట్లు వంటివి పంచండి.
మిథునం (Gemini)
ఓం బుధాయ నమః అని 21 సార్లు జపిస్తే మంచిది.
కర్కాటకం (Cancer)
సాయంత్రం వేళలో ఇంట్లో దీపం వెలిగించండి. ఆ దీపం ముందు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి.
సింహం (Leo)
ఏదన్నా బంగారు వర్ణంలో ఉన్నవాటిని ధరించండి.
కన్య (Virgo)
గోమాతలకు ఆకు పచ్చ రంగులో ఉండే ఆహారం తినిపించండి
తులా (Libra)
ఇంట్లో ధూపం వేయండి
వృశ్చికం (Scorpio)
ఎవరికైనా నల్ల రంగులో ఉండే దుస్తులు కానీ నల్ల నువ్వులు కానీ దానం చేయండి
ధనుస్సు (Sagittarius)
ఏదన్నా ఆధ్యాత్మిక కథను కానీ దేవుడి పాటలను వినండి
మకర (Capricorn)
మీ ఇంటి బాల్కనీ నుంచి ఆకాశం బాగా కనిపించచేలా ఉంటే దీపం పెట్టండి. అంటే ఆకాశానికి దీపాన్ని చూపుతున్నట్లు ఉండాలి.
కుంభ (Aquarius)
పేదలకు దుప్పట్లు, దుస్తులు, ఆహారం వంటివి పంచండి.
మీనం (pisces)
రావి చెట్టుకు నీళ్లు పోసి కాసేపు దాని ముందు కూర్చుని ధ్యానం చేసుకోండి.





