Ajit Pawar విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చివరి కోరికను వెల్లడించారు ఆయన కుటుంబానికి సన్నిహితుడైన కిరణ్ గుజార్.
NCPలో చీలికలు ఏర్పడంతో మేనమామ, సీనియర్ నేత శరద్ పవార్‌కు దూరమయ్యారు అజిత్. దాంతో శరద్ పవార్ NCP (SCP)గా తన పార్టీ పేరు మార్చుకున్నారు.
SCP అంటే శరద్ చంద్ర పవార్. అంటే ఆయన పార్టీలో ఆయన నేతలు మాత్రమే ఉండేలా చూసుకున్నారు.
అయితే.. అజిత్ భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో NCP చాలా నష్టపోయింది.
ఈ నేపథ్యంలో ఆయన NCP SCP నేతలు ఒక్కటవ్వాలని..కనీసం స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కలిసి కట్టుగా ఉండి పోటీ చేయాలని కలలు కన్నారట.
ఇందుకోసం ఎన్నికలకు సంబంధించని పత్రాలను కూడా తెప్పించుకున్నారని కిరణ్ గుజార్ తెలిపారు. చాలా సార్లు దీని గురించి పవార్ కుటుంబంలో చర్చలు జరగడం తాను విన్నానని అన్నారు.





