Twist In Saif Ali Khan Case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన ఎటాక్ విషయంలో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. ఇప్పటికే ముంబై పోలీసుల అదుపులో ఉన్న మహ్మద్ షెహజాద్ అసలు నిందితుడు కాదని.. సైఫ్ ఇంట్లో లభించిన వేలి ముద్రలకు ఆ నిందితుడికి ఎలాంటి మ్యాచింగ్ లేదని పోలీసులు తెలిపారు. అదీకాకుండా సైఫ్ ఇంట్లో నుంచి ఫైర్ ఎగ్జిట్ ద్వారా పారిపోయిన నిందితుడు సీసీ కెమెరా వైపు చూడగా.. ఆ ఫోటోను పోలీసులు రిలీజ్ చేసారు.
ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు.. సైఫ్ ఇంట్లో సీసీ కెమెరాకు చిక్కిన నిందితుడు ఒకరు కాదు అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇప్పుడప్పుడే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఈ నేపథ్యంలో సైఫ్ తన భార్య కరీనా కపూర్‌తో కలిసి నిన్న డిన్నర్ డేట్‌కి కూడా వెళ్లారు. సో వాళ్లు తమ జీవితంలో జరిగిన ఇంతటి సీరియస్ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మళ్లీ మామూలు జీవితాన్ని మొదలుపెడుతున్నారు. Twist In Saif Ali Khan Case
ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ విషయం బయటికి వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీలపై షాకింగ్ ఆరోపణలు చేస్తూ ఫేమస్ అయిన విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ సైఫ్‌పై జరిగిన దాడి విషయంలో తనకు తెలిసిన విషయం ఇది అంటూ ఓ సంచలన ట్వీట్ చేసాడు. ఇంతకీ ఆయన ట్వీట్‌లో ఏం చెప్పారంటే.. సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లో లేదట. ఆమె పార్టీకి వెళ్లిందట. అదే సమయంలో సైఫ్ తన ఇంట్లోని ఓ పని మనిషితో ఏదో విషయం గురించి మాట్లాడుతుండగా.. ఆ పనిమనిషి ప్రియుడు అప్పుడే ఇంట్లోకి వచ్చాడట.
వారిద్దరూ కూర్చుని మాట్లాడుకోవడం చూసి అతనికి ఒళ్లుమండి కత్తితో సైఫ్‌పై దాడి చేసాడట. కత్తి విరిగి సైఫ్ వెన్నెముకలో గుచ్చుకోవడంతో అతను ఆగాడు కానీ లేదంటే మరిన్ని కత్తిపోట్లు పడేవని కమల్ అంటున్నాడు. అయితే.. ఇదంతా బయటికి తెలిస్తే పరువు పోతుంది కాబట్టి చోరీ కథ అల్లినట్లు తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని తెలిపాడు. అందుకే దాడి చేసిన వ్యక్తి పారిపోతున్నప్పుడు సీసీ కెమెరాలో కనిపించింది కానీ లోపలికి వెళ్తున్నట్లు ఎక్కడా లేదని.. సైఫ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు కూడా సీసీ ఫుటేజీలు బయటపెట్టడంలేదని ఆయన ఆరోపిస్తున్నారు. Twist In Saif Ali Khan Case
ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది మాత్రం కమల్ చెప్తున్న దాంట్లో నిజం ఉండే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ దొంగతనం జరిగి ఉంటే దొంగ ఏదో ఒక డోర్ నుంచి లోపలికి వెళ్లి ఉంటాడు. అంతపెద్ద సెలబ్రిటీ ఇంట్లో సీసీ కెమెరాలు ఒక 50 వరకు ఉంటాయి. వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ఏ సీసీ కెమెరాలో కూడా దొంగ ఇంట్లోకి వెళ్లడం అనేది రికార్డు కాకపోవడం ఏంటి? సైఫ్‌పై దాడి జరగడం కూడా నాటకం అని తెలుస్తోందని ఓ పక్క భారతీయ జనతా పార్టీ నేత నితీష్ రాణే కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సైఫ్ విషయంలో ఇంతటి దారుణం జరిగి ఉంటే తప్పకుండా నేరం చేసినవాడిని శిక్ష పడాలి కానీ ఎవరో అమాయకుడిని తీసుకొచ్చి బంగ్లాదేశ్ వాసి అంటూ మాటిమాటికీ అదే పాయింట్‌ని చెప్తూ వైరల్ చేయడం కరెక్ట్ కాదు.
పోలీసులు అత్యుత్సాహం వల్ల ఆల్రెడీ ఒక అమాయకుడు పాపం తన జీవితాన్నే కోల్పోయాడు. సైఫ్‌పై ఎటాక్ జరిగిన తర్వాత పోలీసులు ఆకాశ్ అనే వ్యక్తిని అనుమానితుడిగా భావించి అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆకాశ్ పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. అదే సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి విచారించి.. ఆ తర్వాత అతను కాదు అని నిర్ధారించుకుని వదిలేసారు. తాను ఏం చేయలేదు అని చెప్పినా ఆ అమ్మాయి తరఫు వాళ్లు సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆకాశ్‌ని తన బాస్ కూడా ఉద్యోగం నుంచి తీసేసారు. తానే పాపం చేయకపోయినా వీధిలోని వాళ్లంతా సూటిపోటి మాటలు అంటున్నారట. పోలీసులు తన జీవితాన్ని నాశనం చేసారని.. సైఫ్ ఇంటి ముందు నిలబడి తనకు మంచి ఉద్యోగం ఇప్పించాలని ప్రాధేయపడతానని అంటున్నాడు. Twist In Saif Ali Khan Case