The Girlfriend: రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా నాన్ ఇంగ్లీష్ సినిమాగా టాప్ 2 లో నిలిచింది. ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య, గాయని చిన్మయి శ్రీపాద ఎక్స్ ద్వారా వెల్లడించారు. టాప్ 1లో ట్రోల్ 2 సినిమా ఉండగా… 2 లో ది గర్ల్‌ఫ్రెండ్ ఉంది.
ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషించారు. అయితే.. ఈ సినిమాకు స్క్రిప్ట్ రాసింది చిన్మయినే అని చాలా మంది ట్రోల్స్ చేసారు. దీనికి కూడా చిన్మయి సమాధానం ఇచ్చారు. తానే స్క్రిప్ట్ రాసుంటే వంద శాతం క్రెడిట్ తానే తీసుకుంటాను కానీ తన భర్తకు ఎందుకిస్తాను అని అన్నారు.





