Naga Chaitanya Sobhita సినీ నటుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాలల వివాహం ఈ ఏడాది డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కుటుంబాల నుంచి శుభలేఖలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి రాజస్థాన్‌లో జరుగుతుందని అంతా అనుకున్నారు కానీ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోసే వేదికగా మారనుంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య, శోభిత, నాగార్జున, అమల గోవాలో జరిగిన IFFI ఫిలిం ఫెస్టివల్‌కు కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభిత నాగచైతన్య చెయ్యి పట్టుకుని వస్తుండగా.. అక్కడే ఉన్న కెమెరామెన్లు మేం మీ పెళ్లికి వస్తాం అని ఆటపట్టించారు. దీనికి శోభిత స్పందిస్తూ.. తప్పకుండా రండి. ఫుడ్ చాలా బాగుంటుంది అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభిత రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి ఫోటోలను తొలిసారి లండన్‌కి చెందిన భారతీయ చెఫ్ ఒకరు బయటపెట్టడంతో వీరి డేటింగ్ బాగోతం బయటపడింది. ఆ తర్వాత ఆగస్ట్ 8న నిశ్చితార్థంతో తామిద్దరం డేటింగ్‌లో ఉన్న మాట నిజమే అని స్పష్టం చేసేసారు. డిసెంబర్ 4న ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల నడుమ వీరి వివాహం సింపుల్‌గా జరగనుంది. అదే రోజు సాయంత్రం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేయనున్నారు.