Sankashtahara Chaturthi: మనకు ఉన్న 12 మాసాలలో.. వైశాఖ, ఆషాఢ, శ్రావణం, కార్తీకం, ఆశ్వీయుజం, మార్గశిరం, మాఘం.. ఈ మాసాలన్నీ కూడా మానవులు తరించడానికి అంటే తమ సంకల్పం నెరవేరడం కోసం చేసుకునే పూజ, వ్రత నియమాలు పాటించేందుకు అనువైనవి. మిగతా మాసాల్లో తిథులను బట్టి పూజలు చేసుకుంటాం.
మనకు సంకష్ఠహర చతుర్థి అనేది అనాదిగా యుగయుగాల నుంచి ఆచరిస్తున్న వ్రత విధానం. దీని వల్ల మనకు కలిగే లాభాలు, శుభాలు అనేకం. ఆ శుభాలు వర్ణించడానికి మనకు ఒక సమయం అంటూ సరిపోదు. ఎందుకంటే.. కరుణామయుడు, దయామయుడు సాక్షాత్తు విఘ్నేశ్వరుడు. ఎవరు పిలిచినా పలుకుతారు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఒక గాథ కూడా ఉంది. అదేంటంటే.. పూర్వం.. గణపతి చిన్నతనంలో ఓ పిల్లిని చూసి దానిని పట్టుకోవాలని దాని వెంటపడతాడు. కానీ అది పారిపోతూ ఉంటుంది. దాంతో కోపంతో దాని వెంటపడి పట్టుకుని దానిని గోళ్లతో గీరేస్తాడు.
Sankashtahara Chaturthi గీరేసరికి దానిపై చారలు వస్తాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతాడు. అమ్మా ఆకలేస్తుంది అని పార్వతి అమ్మవారి వద్దకు వెళ్తాడు. అప్పుడు పార్వతి అమ్మవారు గణనాథుడిని చూడకుండా నీ భోజనం అక్కడే ఉంది తీసుకో అంటుంది. అప్పుడు గణనాథుడు అమ్మవైపు చూసి ఏంటబ్బా అమ్మ నా వైపు చూడకుండా మొహం చాటేసి సమాధానం చెప్తోంది అని ఆమె ముందు వెళ్లి నిలబడతాడు. బొజ్జ గణపయ్య తనవైపు వస్తున్నాడని తెలిసి అమ్మ ముఖం తిప్పుకుంటుంది. చివరికి గణనాథుడు అమ్మ ముఖం చూస్తాడు. ఆమె ముఖంపై చారలు పడటం చూసి ఆశ్చర్యపోతాడు.
ఏమైందమ్మా అని అడిగితే.. నువ్వు చేసిన గాయమే అని చెప్తుంది. కానీ గణనాథుడికి అర్థం కాదు. నేనెప్పుడు గాయపరిచానమ్మా అని అడుగుతాడు. నువ్వు పిల్లిని గీరావు కదా.. అంటే నన్ను గీరినట్లే. ఎందుకంటే ఈ ప్రపంచంలోని అన్ని పక్షులు, జంతువులు.. అంతెందుకు ప్రాణం ఉన్న ప్రతీదీ నా బిడ్డే. మరి నా బిడ్డను గాయపరిస్తే నన్ను గాయపరిచినట్లే కదా అంటుంది. దానికి పాపం గణనాథుడు ఎంతో బాధపడతాడు. వెంటనే ఆ పిల్లిని చేరదీసి ఇక ఏ ప్రాణికీ హాని తలపెట్టను అని అమ్మకు మాటిస్తాడు. అంతటి దయగల గణపతిని సంకష్ఠహర చతుర్థి నాడు పూజిస్తే ఎలాంటి మొండి సమస్యలు ఉన్నా తీరిపోతాయి.
మనం వినాయకుడికి సంబంధించి రెండు చవితిలు చేసుకుంటాం. ఒకటి వరద చతుర్థి మరొకటి సంకష్ఠహర చతుర్థి. వరద చతుర్థి అంటే వినాయక చవితి. సంకష్ఠహర చతుర్థి మాత్రం పౌర్ణమి వెళ్లిన తర్వాత వచ్చే చవితి రోజున జరుపుకుంటాం. అది కూడా ప్రదోష కాలంలో చేసుకోవాలి. అంటే సంధ్యా సమయంలో చేసుకోవాలి. పైగా ఆదివారం (16) చవితి రావడం చాలా శుభకరం. ఎందుకంటే మాఘమాసం. ఆదివారం రవికి సంబంధించిన వారంగా చెప్పబడింది. పైగా హస్తా నక్షత్రం వచ్చింది.
Sankashtahara Chaturthi అంటే చవితి తిథిని నిర్ణయించేది చంద్రుడి గమనమే. అలాంటి చంద్రుడికి సంబంధించిన హస్త నక్షత్రం ఉండగా.. ఈ సంకటహర చతుర్థి రావడం ఎంతో శుభ్రప్రదం. మరో విషయం ఏంటంటే.. బుధుడు అనేవాడు కన్యా, మిథున రాశులకు అధిపతి. ఈ చవితి నాడు బుధుడు ఉచ్ఛస్థితి పొందుతాడు. కన్యా రాశిలో చంద్రుడు ఉండగా.. చవితి ఏర్పడుతోంది కాబట్టి కన్యా రాశి వారు తప్పకుండా ఈ సంకష్ఠహర చతుర్థిని జరుపుకోవాలి. ప్రదోష కాల సమయంలో ఈ పూజ చేసుకోవాలి కాబట్టి.. ఆ ప్రదోష కాల సమయం స్థిరలగ్నం అయిన సింహ లగ్నంలో ఏర్పడింది.
సింహ లగ్నం లక్ష్మీప్రదం. సింహ లగ్నాధిపతి అయిన రవ.. హస్త నక్షత్రం ఏ రాశిలో ఉందో ఆ రాశి అధిపతి అయిన బుధుడు కూడా సప్తమ కేంద్రంలో స్థితిపొంది ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. ఇది చాలా విశేషం. పైగా రాశి నుంచి నవమ స్థానంలో గురుడు ఉన్నాడు. సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదాన్ని సూచించేవే. కాబట్టి కచ్చితంగా సంకష్ఠహర చతుర్థి జరుపుకునేందుకు యత్నించండి. అన్ని రకాల శుభాలు కలుగుతాయి. ఎన్ని కఠోర సమస్యలైనా తీరిపోతాయి. ఈ చతుర్థిని ప్రతి నెలా చేసుకుంటే ఆ ఇంట్లో అశుభం అనేది ఉండదు.
పూజా విధానం
ఇక ఈ పూజ ఎలా చేసుకోవాలంటే.. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఒక చతురస్రంగా ఉన్న పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఒక పీటని పెట్టి పసుపుతో అలంకరించి షడ్కోణంలో ముగ్గు వేసి పసుపు, కుంకుమ అలంకరించి.. దానిపై ఈ పసుపు వస్త్రాన్ని ఉంచి దానిపై మూడు పిడికిళ్లు బియ్యం పెట్టి దానిపై తమలపాకులు, ఖర్జూరాలు, వక్కలు, పసుపు గణనాథుడిని ఉంచాలి. గణపతి పూజను ప్రారంభించి షోడశోపచార పూజను నిర్వహించాలి. ప్రదోష కాల సమయంలో కాలకృత్యాలు తీర్చుకుని మళ్లీ గణపతి పూజను స్టార్ట్ చేయాలి. అయితే.. ఈ గణపతి పూజ అనేది మనం దేవాలయానికి వెళ్లి గణనాథుడికి గరికతో అర్చన చేయించుకోవాలి.
Sankashtahara Chaturthi ఆ తర్వాత ఇంటికి వచ్చి ఈ సంకష్ఠహర చతుర్థి రోజున తప్పకుండా చంద్రుడిని చూడాలి. పూజా సమయంలో ఏదైతే మూడు పిడికిళ్ల బియ్యం వేసామో ఆ బియ్యాన్ని బెల్లంతో పాయసంగా చేసుకోవాలి. గణపతికి నైవేధ్యంగా పెట్టాలి. వినాయక చవితి రోజున ఎలా పూజ చేస్తామో ఆ విధానంగా పూజ చేసుకోవచ్చు.