Saif Ali Khan Case: సెలబ్రిటీల విషయంలో ఏదన్నా నేరం జరిగినా.. లేదా సామాన్య వ్యక్తి పట్ల ఏదన్నా ఘోరం జరిగినా తెగ వైరల్ అయిపోతుంది. ఒక నాలుగు రోజుల పాటు భారతదేశంలోని మీడియా దీని గురించే చెప్పి ఇంకా వైరల్ చేస్తుంటుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విషయంలో అదే జరిగింది. ముంబైలోని బాండ్రాలో ఉన్న ఆయన నివాసంలో రెండు వారాల క్రితం ఓ దుండుగుడు చోరీ చేయాలనుకోవడం.. అడ్డుకున్న సైఫ్‌పై కత్తిపోట్లు దింపడం.. ఆ తర్వాత ఆయన్ను హాస్పిటల్‌కు తరలించి వారం రోజుల పాటు చికిత్స అందించడం జరిగాయి.
పోలీసుల అత్యుత్సాహం
ఇటీవల సైఫ్ కోలుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. ఈ గ్యాప్‌లో ముంబై పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని అబ్బే వారు కాదు అని వదిలేసారు. ఆ తర్వాత నేరం జరిగిన 90 గంటలకు ఓ నిందితుడిని పట్టుకుని దొరికేసాడు అన్నారు. నిందితుడు బంగ్లాదేశ్‌కి చెందిన ముస్లిం అని అతని పేరు మహ్మద్ షెహజాద్ అని అన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చాడని.. కొన్ని నెలల పాటు పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకుని ఆ తర్వాత బతుకు తెరువు కోసం ముంబై వెళ్లాడని అన్నారు. ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో చేరి సైఫ్ ఇంట్లో చోరీ చేయాలనే ప్లాన్ చేసాడని.. ఆ ప్లాన్ ప్రకారమే పక్కగా రెక్కీ నిర్వహించి మరీ సైఫ్ ఇంట్లోకి చొరబడ్డారని అన్నారు. Saif Ali Khan Case
ఆ అనుమానమే నిజమైంది
అయితే.. ఇప్పుడు కేసులో అసలు ట్విస్ట్ బయటపడింది. ముందు నుంచి కొందరు రాజకీయ నేతలు, నెటిజన్లు అనుమానపడినట్లుగానే జరిగింది. సైఫ్ ఇంట్లో చోరీ చేసిన వ్యక్తి పారిపోతూ సీసీ కెమెరా వైపు ఓ లుక్ ఇచ్చి వెళ్లిపోయాడు. అందులో రికార్డ్ అయిన ఫోటోనే పోలీసులకు రిలీజ్ చేసారు. అయితే ఆ ఫోటోలో ఉన్న దుండగుడు.. పోలీసులు పట్టుకొచ్చిన వ్యక్తి ఒకరు కాదు అని ఈరోజు తెలిసిపోయింది. ఎందుకంటే సైఫ్ ఇంట్లో దొంగకి సంబంధించిన వేలిముద్రలు సేకరించిన ఫోరెన్సిక్ టీం వాటిని పరీక్షించగా.. ఆ వేలిముద్రలకు పోలీసులు అదుపులో ఉన్న నిందితుడికి ఎలాంటి పోలిక లేదట. అంటే ఆ వేలి ముద్రలు మహ్మద్‌వి కావు. మరి ఎవరివి? అలాగైతే అసలు దొంగ కూడా అతను కానట్లే కదా..! Saif Ali Khan Case
చోరీ అబద్ధమా?
అసలు నిందితుడిని పట్టుకోకుండా కనీసం అతను పోలిన వ్యక్తిని పట్టుకోకుండా ముంబై పోలీసులు కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వల్లో లేదా సెలబ్రిటీ నుంచి వస్తున్న కామెంట్స్ వల్లో పోలీసులు తొందరపడినట్లు తెలుస్తోంది. లేదా.. అసలు చోరీ జరగడం అనేదే అబద్ధమా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి చెందిన నితీష్ రాణే అనే ఎమ్మెల్యే సైఫ్‌కి ఆరు గంటల పాటు సర్జరీ జరిగిందని అంటున్నారని.. కానీ ఆయన కోలుకుని బయటికి వచ్చిన తీరు చూస్తుంటే నమ్మశక్యంగా లేదని అన్నారు.
అసలు చోరీ జరగడం కూడా నిజం కాదనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. పోలీసులు త్వరగా ఈ కేసు క్లోజ్ చేసి తమపై ఉన్న భారాన్ని వదిలించుకోవాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం అదుపులో ఉన్న నిందితుడిని ఇరికించినట్లు తెలుస్తోంది. ఒకవేళ నిందితుడు తానే చోరీ చేసానని ఒప్పుకుంటే అది కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్ని కేసుల్లో డబ్బు ఆశ చూపి నేరం చేసినట్లు ఒప్పుకోమని చెప్తుంటారు. ఆ తర్వాత బెయిల్‌పై విడిపిస్తుంటారు. ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నవే. మరి ఈ కేసులో దొరికిన వేలిముద్రలకు కస్టడీలో ఉన్న నిందితుడివి కావు అన్నప్పుడు అసలు నిందితుడు ఎవరు అనేది బయటికి రావాల్సి ఉంది. Saif Ali Khan Case