Roja ఓ యువతి తనపై పలుమార్లు అత్యాచారం చేసి అబార్షన్లు చేయించాడంటూ మీడియా ముందుకు వచ్చిన జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై షాకింగ్ ఆరోపణలు చేస్తుంటే అతని పార్టీ నుంచి తొలగించకుండా త్రిసభ్య కమిటీ వేయించి విచారణ చేపిస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజా.
నగరిలో రోజాతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి పలువురు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు న్యాయం జరగాలంటూ ధర్నాకు దిగారు.
ఈ నేపథ్యంలో రోజా మీడియాతో మాట్లాడుతూ.. వీడియోలో శ్రీధర్ అనే వ్యక్తి అంత క్లియర్‌గా కనిపిస్తుంటే అందులో నిజం ఉందో లేదో త్రిసభ్య కమిటీ వేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటానని పవన్ అన్నారని.. ఆయనకు వీడియోను బ్లర్ చేయకుండా నేరుగా పంపాలని అన్నారు.
ఓ రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ఉంటే ఆడవాళ్లకు రక్షణ ఉండదు అని వంగలపూడి అనితను చూస్తే అర్థమైపోయిందని.. ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.





