Prudhvi Raj Wife: విశ్వక్ సేన్ (Vishwak sen) నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో (Laila pre release event) 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ చేసిన ఓవరాక్షన్ గురించి తెలిసిందే. ఈ సినిమాలో పృథ్వీ కామెడీ రోల్‌లో నటించారు. అయితే.. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ స్టేజ్‌పై మాట్లాడుతూ.. సినిమాలో తనది ఒక సన్నివేశం ఉందని.. ఆ సన్నివేశంలో 150 గొర్రెలు ఉంటాయని.. సినిమా చివర్లో ఆ గొర్రెల్ని లెక్కేస్తే పదకొండే మిగిలాయి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పృథ్వీ రాజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.
బాయ్‌కాట్ లైలా అంటూ ట్విటర్‌లో ఓ హ్యాష్‌ట్యాగ్ మొన్నటి నుంచి ట్రెండ్ అవుతోంది. దాంతో సినిమాకు ఎక్కడ కలెక్షన్లు రావో అన్న భయంతో నిన్న విశ్వక్ సేన్‌తో పాటు నిర్మాత సాహు గరపాటి ప్రెస్ మీట్ పెట్టారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని.. ఆయన తరఫున తాను క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. ఇలా బాయ్‌కాట్ పేరిట ఎందరో కలిసి కష్టపడి తీసిన ఓ సినిమాను చంపేయకండి అని రిక్వెస్ట్ చేసారు. పృథ్వీ స్టేజ్‌పై అలా మాట్లాడుతున్నప్పుడు తాను కానీ నిర్మాత సాహు కానీ అక్కడ లేమని.. చిరంజీవి వచ్చారని తెలిసి ఆయన్ను రిసీవ్ చేసుకునేందుకు బయటికి వెళ్లామని అన్నారు. ఒకవేళ తాము అక్కడే ఉండి ఉంటే పృథ్వీ అలా మాట్లాడే ముందే మైక్ లాక్కునే వాళ్లమని అన్నారు.
హాస్పిటల్‌లో పృథ్వీ రాజ్
Prudhvi Raj Wife ఓ పక్క పృథ్వీ రాజ్‌పై ట్రోల్స్, కామెంట్స్ దారుణంగా వస్తున్న నేపథ్యంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. దీనిపై ఆయన భార్య మీడియాతో మాట్లాడారు. చాలా మంది సారీ చెప్పకపోతే చంపేస్తాం, సినిమా ఆడనివ్వం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తాము సారీ చెప్పాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గొర్రెల పార్టీ అని ఒప్పుకుంటేనే చెప్తామని ఆవిడ అన్నారు. ఎవరికీ భయపడేది లేదని ఆమె ధీమా వ్యక్తం చేసారు.