Robin Uthappa: విరాట్ కోహ్లీ (Virat Kohli) వల్లే అంబటి రాయుడు కెరీర్ అర్థాంతరంగా ఆగిపోయిందని అన్నారు సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్పా. విరాట్ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడు తనకు నచ్చిన ఆటగాళ్లను టీంలో పెట్టుకుని నచ్చని వారిని పక్కనపెట్టాలని ప్లాన్లు వేసేవాడని అన్నారు. 2019 ODI వరల్డ్ కప్ సమయంలో విరాట్‌కు అంబటి రాయుడుతో (Ambati Rayudu) పడేది కాదని.. అతనంటే అయిష్టాన్ని పెంచుకున్న విరాట్ టీంలో ఉండనివ్వకుండా తప్పించేసాడని షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
2019 వరల్డ్ కప్ టీంలో రాయుడు ఆడాల్సి ఉందని.. అతన్ని టీం కూడా సెలెక్ట్ చేసిందని.. పాపం రాయుడు తన క్రికెట్ కిట్‌తో సిద్ధమై రోజూ ప్రాక్టీస్ చేసేవాడని.. కానీ విరాట్‌కి అతనంటే ఇష్టం లేకపోవడంతో లేని పోని చాడీలు చెప్పి టీంలో ఆడనివ్వకుండా చేసాడని ఆరోపించారు. అంబటి స్థానంలో తనకు అనుకూలంగా ఉండే విజయ్ శంకర్‌ను తీసుకున్నాడని.. ఆ సమయంలో ఈ నిర్ణయం సంచలనంగా మారిందని గుర్తుచేసుకున్నారు. ఎందుకు అంబటి రాయుడుని విజయ్ శంకర్‌తో రీప్లేస్ చేసారని అప్పట్లో మీడియా వర్గాలు ప్రశ్నించగా.. అప్పటి సెలెక్టర్ MSK ప్రసాద్ వివాదాస్పదం కాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. విజయ్ శంకర్‌ను తీసుకోవాలని కేవలం విరాట్ నిర్ణయించుకోలేదని.. ఇతర సెలెక్టర్లను అడిగే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్ధించుకున్నారు.
ఆట తీరు బాలేదనో ఫాంలో లేరనో చివరి నిమిషంలో తీసేస్తుంటారు. అలా తీసేసినా రాయుడు పెద్దగా బాధపడేవాడు కాదు. కానీ విరాట్‌కి నచ్చలేదని తనను స్వ్కాడ్ నుంచి తీసేయడంతో రాయుడు ఎంతో బాధపడ్డాను. సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విషయంలో కూడా విరాట్ తప్పు చేసాడని ఈ సందర్భంగా ఉతప్ప తెలిపారు. యువీ క్యాన్సర్ నుంచి కోలుకున్నాక తిరిగి ఫాంలోకి రావాలనుకున్నాడని.. ఆ సమయంలో యువీని ఎక్కువగా హైలైట్ చేయకూడదని విరాట్ అనుకున్నాడని తెలిపారు. యువీ విషయంలో తన నిర్ణయాలు బాగా ప్రభావితం చేసేవని.. దాని వల్ల కూడా యువీ కొంత వరకు కెరీర్‌లో నష్టపోయాడని వెల్లడించారు. (Robin Uthappa)