Ranji Trophy: చాలా కాలం తర్వాత.. దాదాపు 13 ఏళ్ల తర్వాత కింగ్ విరాట్ కోహ్లీ రంజి మ్యాచ్ ఆడబోతున్నాడు. మంగళవారం ఢిల్లీ టీం తరఫున కోహ్లీ ఆడతాడు. ఇది విని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. కానీ కోహ్లీ ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్. ఒకవేళ మీరు కోహ్లీ రంజి ట్రోఫీ ఆడటం మీరు చూడాలనుకుంటే మ్యాచ్ జరగనున్న ప్రాంతానికి వెళ్లి చూడాల్సిందే. ఎందుకంటే… ఈ ఒక్క మ్యాచ్‌ని టీవీలో లైవ్ ప్రసారం చేయరు. 2012లో కోహ్లీ రంజి ట్రోఫీకి ఆడాడు. అప్పుడంటే కోహ్లీ ఇంకా రైజింగ్ క్రికెట్ స్టార్. కానీ ఇప్పుడు క్రికెట్ కింగ్, లెజెండ్.
దాంతో రంజి ట్రోఫీలో ప్రస్తుతం ఆడుతున్న జూనియర్ క్రికెటర్లు ఎప్పుడెప్పుడు కోహ్లీతో ఆడతామా.. ఎప్పుడెప్పుడు అతన్ని కలుస్తామా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగా రంజి ట్రోఫీలు జరిగేటప్పుడు జిల్లా క్రికెట్ అసోసియేషన్లు అంతగా భద్రతను పెట్టరు. ఓ నలుగురు పోలీసులను మాత్రమే నియమిస్తుంటారు. కానీ ఈసారి కోహ్లీ వస్తున్నాడు కాబట్టి ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. సాధారణంగా ఒక గేటు వద్దే సెక్యూరిటీని నియమిస్తుంటారు. కానీ కోహ్లీ కోసమని నాలుగు గేట్ల వద్ద సెక్యూరిటీ ఏర్పాటుచేసారు. (Ranji Trophy)
బాత్రూమ్‌లు శుభ్రంగా ఉంచడం.. క్వాలిటీ మంచి నీళ్ల బాటిళ్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. కానీ ఇలా కోహ్లీ వచ్చినప్పుడో ఇతర స్టార్ క్రికెటర్ వచ్చినప్పుడో మాత్రమే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం సబబు కాదు. రంజి ట్రోఫీ ఎప్పుడు జరిగినా కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. కర్ణాటక వర్సెస్ హర్యాణా, బెంగాల్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లు మాత్రమే లైవ్ టెలికాస్ట్ అవుతాయి. ఢిల్లీ మ్యాచ్ మాత్రం టెలికాస్ట్ చేయాలనుకోవడం లేదు. ఢిల్లీ స్వ్కాడ్‌లో ఆయుష్ బడోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. విరాట్ కోహ్లీ, నవదీప్ సైనీ. యష్ ధుల్ తదితరులు ప్లేయర్లుగా ఉండనున్నారు. జనవరి 30న ఈ రంజి ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. (Ranji Trophy)