Pooja Hegde: పూజా హెగ్డే.. తెలుగులో మంచి హిట్స్ అందుకుని మొన్నటి వరకు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు అంతగా అవకాశాలు లేకపోవడంతో తమిళం, హిందీ వైపు వెళ్లింది. కనీసం తమిళంలో చేసిన అరకొర సినిమాలైనా కాస్త మంచి టాక్ అందుకున్నాయి. కానీ హిందీలో చేసిన సినిమాలు మాత్రం పూజకు పీడ కలల్నే మిగిల్చాయని చెప్పాలి. ఇప్పుడు పూజ సూర్యతో నటించిన రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న రిలీజ్ కాబోతోంది.
అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పూజ చేసిన ఓ కామెంట్ తెగ వైరల్ అవుతోంది. రెట్రోలో మిమ్మల్ని తీసుకోవాలన్న ఆలోచన కార్తిక్ సుబ్బరాజ్‌కు ఎందుకు వచ్చింది అని అడగ్గా.. తాను ప్రభాస్‌తో నటించిన రాధే శ్యాం సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తన నటన కాస్తో కూస్తో నచ్చి కార్తిక్ తనకు అవకాశం ఇచ్చాడు అని చెప్పింది. ఈ ఒక్క మాటతో ఆ ప్రశ్న అడిగిన వాడు రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోయే ఉంటాడు. రాధే శ్యాంలో పూజ యాక్టింగ్ ఎలా ఉందో తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తిక్‌కి ఆ నటనలో ఏం నచ్చిందో ఏమో..!