Pawan Kalyan Brother: మెగా బ్రదర్స్ అనగానే మనకు గుర్తొచ్చేది చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. ఇది సినిమాల వరకే. రాజకీయాల్లో మాత్రం మెగా బ్రదర్స్ నలుగురట. ఆ నలుగురు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఈ మాటను జనసేనలో కీలక కార్యకర్త అయిన కిరణ్ రాయల్ అన్నాడు. కొంతకాలంగా తెలుగు దేశం పార్టీలో ఓ చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్‌కు ఇస్తే బాగుంటుందని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించి ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్‌కు ఇస్తే బాగుటుందనే చర్చ నడుస్తోంది. మరోపక్క నారా లోకేష్‌కు ఆల్రెడీ మంత్రి పదవి ఉంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి నాగబాబుకి ఇస్తే బాగుంటుందని జనసేన నేతలు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అనుకోవడంలో తప్పు లేదు కానీ తెలుగు దేశం పార్టీలో ఉన్న ఓ వ్యక్తి కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అతనెవరో కాదు.. బుద్ధా వెంకన్న. అప్పుడే ఎక్కడ డిప్యూటీ సీఎం పదవి నాగబాబుకి వెళ్లిపోతుందో అన్న భయంతో ఆయన మొన్న మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడుకి మాత్రమే కాదు తెలుగు దేశం పార్టీకి కూడా వారసుడు నారా లోకేషే అని ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకే ఇవ్వాలని అన్నారు. అసలు ఇంత ఆవేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎప్పుడెప్పుడు కూటమి ప్రభుత్వంలో గొడవలు పెడదామా అని కాచుకుని కూర్చుంది. ఈ సమయంలో మీడియా ముందుకు నోటికొచ్చినట్లు మాట్లాడేసి వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతోంది. (Pawan Kalyan Brother)
ఇదే విషయాన్ని కిరణ్ రాయల్ కూడా ప్రస్తావించారు. నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆశపడటంలో ఏమాత్రం తప్పు లేదని.. తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూడాలని తమకు కూడా ఉందని అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ఒకటిగా ఉండి తీసుకుంటుందని.. కానీ అనవసరంగా కొందరు నేతలు బయటికి వచ్చేసి మీడియా ముందు ఏవేవో మాట్లాడుతుండడం వల్ల వైసీపీ పేటీఎం బ్యాచ్ అయిన కొడాలి నాని, రోజా వంటి వారు ఇంకా గొడవలు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. మెగా బ్రదర్స్ అంటే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారని.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కార్యాలయంపై డ్రోన్ ఎగిరిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని అన్నారు. పవన్ డ్రోన్లకు, తుపాకీలకు భయపడే రకం కాదని.. పవన్ లాంటి వ్యక్తి కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా యావత్ భారతదేశ రాజకీయాలకు ఎంతో అవసరమని తెలిపారు. (Pawan Kalyan Brother)