Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీలోని వారసులంతా చక్కగా ఓ గెట్ టుగెదర్‌లో కలిసారు. నాగచైతన్య, శోభిత ధూళిపాల, సుశాంత్, సుమంత్, సుప్రియలతో పాటు వారి స్నేహితులంతా కలిసి చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటుచేసుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫోటోను సుశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఫోటో బ్లర్‌గా ఉన్నా.. బాగా ఎంజాయ్ చేసామని అన్నారు. శోభిత టేబుల్ దగ్గర కింద కూర్చుని స్టిల్ ఇవ్వగా.. నాగచైతన్య సుశాంత్ పక్కన నిలబడి ఫోటోకు పోజిచ్చారు. గతేడాది డిసెంబర్ 4న శోభిత, నాగచైతన్యల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. స్టూడియోలో ఏర్పాటుచేసిన అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ అనుకున్నారట. దాంతో డెస్టినేషన్ వెడ్డింగ్‌లా కాకుండా సింపుల్‌గా ఫ్యామిలీ సంప్రదాయాలకు విలువిస్తూ కొత్త ప్రయాణానికి స్వాగతం పలికారు.
ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన తండేల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని బుజ్జి తల్లి పాట తెగ వైరల్‌గా మారింది. ఇటీవల రిలీజ్ అయిన శివ తాండవం గ్లింప్స్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 7న సినిమాను రిలీజ్ చేయనున్నారు. శోభిత ధూళిపాల చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. ఆమె టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేసారు. పైగా ఆమె నటించే సినిమాల్లో బోల్డ్, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి మంచి సినిమాల్లో నటిస్తారా.. లేక అలాంటి బోల్డ్ వెబ్ సిరీస్‌లలోనే నటిస్తారా..లేదా మొత్తానికే సినిమాలు మానేస్తారా అనేది వేచి చూడాలి.