MS Raju: తెలుగు దేశం పార్టీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. వైసీపీ నేత రోజా సెల్వమణిపై సెటైర్లు వేసారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో వందలాది గోవులు చనిపోయాయంటూ.. మాజీ టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రావు ఆరోపణలు చేసారు. దీనిపై కూటమి నేతలైన పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులతో పాటు పలువురు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు మండిపడ్డారు. దమ్ముంటే వచ్చి నిరూపించాలని భూమనకు ఫోన్ కాల్స్ చేసి సవాలు విసిరారు.
దాంతో భూమన.. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డితో పాటు, రోజా, కార్యకర్తలు గోశాలకు వెళ్లే ప్రయత్నం చేసారు. దాంతో పోలీసుల వారిని అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దాంతో భూమన రోడ్డుపైనే పడుకోవడం.. రోజా, అభినయ్ రెడ్డిలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం వంటివి జరిగాయి. దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు కానీ ఏ ఒక్క కూటమి నేత కూడా తమతో పాటు రాలేదని వారు వాపోయారు. దీనిపై రోజా మీడియాతో మాట్లాడుతూ.. సవాల్ విసిరిన వారు ఒక్కరూ రాలేదని.. తోక ముడుచుకుని ఆడంగుల్లా తమను హౌజ్ అరెస్ట్ చేయించారని అన్నారు.
రోజా నోటికి అడ్డు అదుపు ఉండదని తెలిసిందే. దాంతో ఎం ఎస్ రాజు రోజాపై ఫైర్ అయ్యారు. రోజాకు ఇంటలో తన భర్త సెల్వమణిని ఆడంగి అని పిలిచి పిలిచి ఇతర మగవాళ్లను కూడా అలాగే పిలుస్తున్నారని.. ఓ మహిళా మాజీ మంత్రి అయ్యుండి మీడియా ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలీదని మండిపడ్డారు. మహిళలు సిగ్గుపడేంత క్యారెక్టర్ ఎవరిదైనా ఉందంటే అది రోజాదే అని అన్నారు. సవాల్ విసిరినప్పుడు భూమనతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు రాకుండా ఏకంగా 2000 మందిని తీసుకుని ర్యాలీగా రావాల్సిన అవసరం ఏముందని అడిగారు.