Tulasi Matti Thilakam: సాధారణంగా సింధూరాన్ని తిలకంగా పెట్టుకుంటారు. మరికొందరు గంధాన్ని కూడా తిలకంగా పెట్టుకుంటూ ఉంటారు. ఇక మార్కెట్‌లో రెడీమేడ్ తిలకం కూడా విరివిగా అమ్మేస్తున్నారు. ఎన్ని రకాల బొట్లు పెట్టుకున్నా.. ఎన్ని రకాల తిలకాలు పెట్టుకున్నా.. నేల మట్టిని మించిన తిలకం మరొకటి లేదని అంటుంటారు పెద్దలు. చాలా మందికి మట్టిని కూడా బొట్టుగా పెట్టుకుంటారన్న విషయం తెలీదు. నిజానికి లలాట లిఖితం అనుంగనీయం అని మన శాస్త్రంలోనే ఉంది.
అంటే బ్రహ్మ రాసిన రాతకు ఉపశమన స్థితిని కలిగించేది మట్టి తిలకం. మన రాతలో ఏదన్నా చెడు లేదా దోషాలు ఉన్నా అవి పోవాలంటే ఈ మట్టి తిలకం పెట్టుకోవాలి అంటారు. పుణ్య పురుషుల జీవ సమాధుల దగ్గరున్న మట్టిని తిలకంగా పెట్టుకుంటే మన ఆయుష్షు పెరుగుతుందని మీకు తెలుసా? కానీ ఇది నిజం. గోధూళి, రావి చెట్టు తులసి కోటలో ఉండే మట్టిని తీసి తిలకంగా పెట్టుకున్నా కూడా మన తలరాత మారిపోతుందనే చెప్పాలి. అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని చెప్తారు. ప్రతి జీవుడికి పుట్టుకతోనే మూడు గండాలు ఉంటాయంటారు. ఆ గండాలు ఈ మట్టిని తిలక ధారణగా పెట్టుకుంటే పోతాయని శాస్త్రంలో రాసుందట.