Search The Query
Search

Image
  • Home
  • News
  • Jagan: నాడు కొమ్మినేని ఉద్యోగం పీకించింది బాబే

Jagan: నాడు కొమ్మినేని ఉద్యోగం పీకించింది బాబే

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తిని ఓ వేశ్య‌ల ప్రాంతం అని కృష్ణంరాజు అనే జ‌ర్న‌లిస్ట్ మాట్లాడిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌ని చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఏర్పాటుచేసిన డిబేట్‌లో కృష్ణంరాజు పాల్గొని నీచ‌పు వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో శ్రీనివాస‌రావును హైద‌రాబాద్‌లోని జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ నుంచి ఆయ‌న్ను అరెస్ట్ చేసి విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారిని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.

సహజంగా ఒక డిబేట్‌ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్‌లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా?

ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబుగారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిగారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్ప‌క్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.

చంద్రబాబుగారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి. అంటూ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top