ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 20 నుంచి ICC ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. పాకిస్థాన్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం వహించబోతోంది. అయితే.. దాదాపు అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరుగుతాయి కానీ.. భారత్ ఆడే మ్యాచ్‌లు, సెమీ ఫైనల్ మ్యాచ్ మాత్రం దుబాయ్‌లో జరగనున్నాయి. ఒకవేళ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది.
ఒకవేళ భారత్ గెలవకపోతే ఫైనల్ మ్యాచ్ మాత్రం జరిగేది లాహోర్‌లోనే. ఈ నేపథ్యంలో BCCI ఓ షరతు పెట్టింది. ICC మ్యాచ్‌లకు ఏ దేశమైతే ఆతిథ్యం వహిస్తుందో.. ఆ దేశం పేరును జెర్సీలపై ప్రింట్ చేస్తారు. ఇది ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయమే. అయితే ఇందుకు BCCI ఒప్పుకోలేదు. ఇండియన్ స్వ్కాడ్ జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండటానికి వీల్లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలిపింది. దాంతో పాక్ బోర్డుకు ఒళ్లు మండింది. ఆటను ఆటలా కాకుండా ఎందుకు రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడింది. (ICC Champions Trophy 2025)
నిజానికి అన్ని టీంల కెప్టెన్లు ఆతిథ్య దేశమైన పాకిస్థాన్‌కు ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లాలి. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వెళ్లడం లేదు. ఒక పక్క పాకిస్థాన్‌లో ఆటా ఆడక.. కెప్టెన్ రాక.. ఇప్పుడు జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ప్రింట్ చేయొద్దు అనడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు BCCIపై నిప్పులు చెరుగుతోంది. ఫిబ్రవరి 20 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఆ తర్వాత మార్చి 2న టీమిండియా న్యూజిల్యాండ్‌తో తలపడనుంది. (ICC Champions Trophy 2025)