ICC Champions Trophy 2025 Pakistan: ఏమన్నా అంటే క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి.. మా దేశానికి వచ్చి ఆడండి. ఇక్కడ కూడా మీకు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటూ తెగ డైలాగులు చెప్తారు. ఏ దేశంలో అయినా క్రికెట్ మ్యాచ్‌లు కానీ లేదా క్రీడలకు సంబంధించిన ఎలాంటి టోర్నమెంట్స్ జరగబోతున్నా కూడా సంవత్సరానికి ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ఎలాంటి లోటు రాకుండా.. ఒకరితో మాట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పాకిస్తాన్ అలా కాదు. నోరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది పరిస్థితి. అసలే చాలా కాలం తర్వాత పాకిస్థాన్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతోంది. ఈ అవకాశాన్ని పాక్ బాగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. మంచిదే. కానీ దానికి తగ్గ ప్లానింగ్ అంటూ ఉండాలి కదా.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కి పాకిస్థాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తోంది. కానీ రాజకీయ పరిణామాల దృష్ట్యా పాకిస్థాన్, ఇండియాకు మధ్య జరగాల్సిన మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. టీమిండియా పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని BCCI ఎప్పటి నుంచో అంటోంది. ఇందుకు ముందు నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడం లేదు. చాలా కాలం తర్వాత పాకిస్థాన్‌లో అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతుండడంతో అన్ని మ్యాచ్‌లు లాహోర్‌లోనే జరగాలని చెప్పింది. కానీ BCCI ICCతో మాట్లాడుకుని భారత్‌కు పాకిస్థాన్‌కు మధ్య జరగాల్సిన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగాలని ఒప్పందం కుదుర్చుకుంది. ICC ఈ నిర్ణయంతో ఏకీభవించడంతో పాక్ కూడా చచ్చినట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. ICC Champions Trophy 2025 Pakistan
ఈ ఒప్పందానికి పాక్ ఒప్పుకున్నా కూడా టీ20 వరల్డ్ కప్ భారత్‌లోనే జరగబోతోంది కాబట్టి అప్పుడు మేం కూడా భారత్‌కి వచ్చి అస్సలు ఆడబోం అంటూ ఇప్పటి నుంచే బెదిరింపులకు పాల్పడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకొన్ని రోజులు మాత్రమే ఉందనగా ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. అక్కడ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంతో పాటు రావల్పిండి, కరాచీలోని స్టేడియంలలో ఇంకా రిపేర్లు జరుగుతున్నాయి. స్టేడియం నిర్మాణ పనులు పూర్తి కాలేదు. డిసెంబర్ 30 నాటికే అన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది కానీ జనవరి వరకు సమయం కావాలని ICCని కోరింది. సరే అని ఇందుకు కూడా ICC ఒప్పుకుంది. ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో అన్ని పనులు అయిపోతాయని చెప్తోంది. ఇలా అయితే అక్కడ మ్యాచ్‌లు ఎలా జరుగుతాయి? అరకొర పనులు చేసి వదిలేస్తే రేపు ఏదన్నా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు. ఇలాంటి పొరపాట్లన్నీ తమ వైపు పెట్టుకుని ఊరికే భారత్‌పై పడిస్తే ఎవరికి ఉపయోగం?
ముఖ్యంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం చాలా ముఖ్యం. దాదాపు అన్ని మ్యాచ్‌లు అక్కడే జరుగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆ స్టేడియంకు తుది నుంచి మెరుగులు దిద్దుతున్నారు. అసలు ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతుందో లేదో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ రషిద్ లతీఫ్ స్పందిస్తూ.. టెన్షన్ ఏమీ లేదు అనుకున్నట్లుగానే అన్ని మ్యాచ్‌లు ఇక్కడే బ్రహ్మాండంగా జరుగుతాయని ట్వీట్ చేసారు. కరాచీ, లాహోర్, రవాల్పిండిలోని స్టేడియంలకు మరమ్మతులు చేసేందుకు పాక్ 12 బిలియన్ పాకిస్థానీ రూపాయలను ఖర్చు చేస్తోంది. దీంట్లో కొంత ICC ఇచ్చిన వాటా కూడా ఉంది. ICC Champions Trophy 2025 Pakistan