Financial Issues: మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. అయితే.. ఇంట్లో ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా.. నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా తులసమ్మ మనకు వార్నింగ్‌లు ఇస్తుందని శాస్త్రంలో చెప్పబడిందట. అవేంటో తెలుసుకుందాం.
నల్లటి ఆకులు
తులసి చెట్టుకి ఉన్న ఆకులను సరిగ్గా పరిశీలిస్తూ ఉండాలి. ఆకులు ఉన్నట్టుండి నల్లగా మారుతున్నాయనుకోండి ఇంటికి నరదిష్టి ఉందని అర్థమట. నెగిటివ్ ఎనర్జీలతో ఇల్లు, ఇంట్లోని మనుషులు అల్లాడిపోతుంటారు. తులసి ఆకులు నల్లగా అవుతున్నాయంటే ఇంటి యజమానికి ఏదో పెద్ద సమస్య రాబోతోందని అర్థమట.
వాడిపోవడం
కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తున్నా కూడా తులసి మొక్క ఆకులు వాడిపోతూ వంగిపోతుంటాయి. దీని అర్థం కూడా ఇంట్లో నెగిటివ్ శక్తులు సంచరిస్తున్నాయని అర్థం.
చీమలు
తులసి చెట్టుకి ఉన్నట్టుండి చీమలు పడుతున్నాయనుకోండి ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ.. ఏదన్నా దొంగతనం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఇంట్లో వ్యక్తే హాని తలపెట్టే ప్రమాదం ఉందని కూడా సంకేతం.
ఎదగకపోవడం
చెట్టు నాటిన దగ్గర్నుంచి ఒకేలా ఉండటం.. అసలు ఎదగకపోవడం వంటివి ఉంటే కెరీర్, వ్యాపారాల్లో నష్టాలు, పిల్లలకు అనారోగ్యాలు వంటివి వస్తుంటాయని అర్థమట. తులసి మొక్క ఎదుగుదల లేదంటే ఆ ఇంట్లోని వారికి కూడా ఎదుగుదల ఉండదని చెప్తారు.
వేరే దిశలో నాటడం
తులసి మొక్క ఎప్పుడు కూడా తూర్పు, ఈశాన్యం, ఉత్తరం దిక్కుల్లో ఉండాలి. ఈ మూడు కాకుండా ఎక్కడ పడితే అక్కడ నాటేయడం.. ఫలానా చోట పెడితే చూడటానికి బాగుంటుందని కుండీలో పెట్టేయడం వంటివి అస్సలు చేయకండి. అస్సలు మంచిది కాదు.