Spiritual: దైవారాధన చేసే ప్రతి ఇంట్లో దాదాపు అన్ని దేవతా, దేవుళ్ల స్వరూపాలు ఉంటాయి. ఫోటోల రూపంలో కానీ లేదా విగ్రహాల రూపంలో కానీ పూజిస్తుంటారు. ఇంట్లో కానీ పూజా గదిలో కానీ ఎన్ని ఫోటోలు ఉన్నా ఈ స్వామి వారి ఫోటో కానీ చిన్న విగ్రహం కానీ లేకుండా ఉండకూడదట.
ఆయనెవరో తెలుసా? దక్షిణామూర్తి. శివ స్వరూపం అయిన దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు అని చెప్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. మీ జీవితం సంపూర్ణం కావాలన్నా… సుఖ సంతోషాలు, ప్రశాంతత ఉండాలన్నా మీకు పూజలు చేయడం వచ్చినా రాకపోయినా ఫర్వాలేదు, ఉపనిషద్లు రాకపోయినా ఫర్వాలేదు, స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలు చదవడం రాకపోయినా ఫర్వాలేదు.. ఒక్క దక్షిణామూర్తి స్వామి వారిని అలా చూస్తూ కూర్చుంటే చాలట.
మీరు రోజూ ఇంట్లో విపరీతంగా పూజలు చేయకపోయినా ఫర్వాలేదు. మీ ఇంట్లో కానీ పూజా గదిలో కానీ దక్షిణామూర్తి స్వామివారు ఉంటే చాలు.. కాసేపు ఆయన్ని చూస్తూ కూర్చోండి. ఏదో తెలీని మార్పు మీలోనే మొదలవుతుంది. అది మీకే తెలుస్తుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి. మీకు మరో గమ్మత్తైన విషయం తెలుసా? చంటి పిల్లలు పెరిగి పెద్దవుతున్న సమయంలో వారి కంట దక్షిణామూర్తి స్వామి వారి ఫోటో ఉండేలా చూడండి. పిల్లలకు ఆయన్ను అప్పుడప్పుడు అలా చూస్తూ ఉండిపోయేలా చేయండి. అలా పిల్లలు ఆయన్ను నిశ్చలంగా చూడటం వల్ల రెండు ఫలితాలు ఉంటాయి. ఒకటి పిల్లలకు సరస్వతి కటాక్షం కలుగుతుంది. రెండోది అపమృత్యు దోషం పోతుంది.