Coolie Trailer: సూపర్‌స్టార్ రజినీకాంత్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన కూలీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. లోకేశ్ కనగరాజ్ నుంచి రాబోతున్న మరో అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ నెల 14న రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ అంచనాలను పెంచేలా ఉంది. అయితే.. ట్రైలర్ లాంచ్ అయిన సందర్భంగా నాగార్జున కోడలు, నటి శోభిత ధూలిపాల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. సెమ్మ మాస్. వాళ్లని సాఫ్ట్‌గా చంపేస్తున్నావ్ మావయ్య అంటూ క్యాప్షన్ పెట్టారు.
అప్పుడెప్పుడో వచ్చిన కింగ్ సినిమాలో నాగ్‌ని స్టైలిష్ మాస్ లుక్‌లో చూసి అభిమానులు మురిసిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఆయన నుంచి అలాంటి సినిమా రాలేదు. ఇప్పుడు కూలీలో లోకేష్ కనగరాజ్ నాగార్జున్‌కి ఇచ్చిన క్యారెక్టర్, డిజైన్ చేసిన లుక్‌ని చూసి అభిమానులు వింటేజ్ నాగ్‌ను చూడబోతున్నామంటూ ఆనందపడుతున్నారు. ఈ సినిమాలోని ఓ సీన్‌లో నాగ్ తన జుట్టు సవరించుకుంటున్న లుక్ ఓ రేంజ్‌లోఉంది. అసలు మన తెలుగు దర్శకులు నాగ్‌ని ఇలా ఎందుకు చూపించలేకపోయారు అంటూ కొందరు కామెంట్స్ కూడా పెట్టారు. ఆగస్ట్ 14న రాబోతున్న కూలీ ఏ రేంజ్‌లో ఆడుతుందో చూడాలి మరి.