Search The Query
Search

Image
  • Home
  • Cinema
  • Bhuma Mounika Reddy భూమా కుటుంబంలోనూ ర‌చ్చ‌.. సంత‌కాలు ఫోర్జ‌రీ

Bhuma Mounika Reddy భూమా కుటుంబంలోనూ ర‌చ్చ‌.. సంత‌కాలు ఫోర్జ‌రీ

Bhuma Mounika Reddy ఓ ప‌క్క మంచు కుటుంబంలో (Manchu Family) ఆస్తుల వివాదం ముదిరిపోతోంది. ఎవ‌రికి వారు ప్రెస్ మీట్లు పెట్టి నాది త‌ప్పు కాదంటే నాది కాదు అని చెప్పుకుంటున్నారు. మ‌రోప‌క్క మీడియాపై దాడి చేసిన త‌ర్వాత మంచు మోహ‌న్ బాబు (Manchu Mohan Babu) అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. హైద‌రాబాద్‌లోని కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యం ప‌క్క‌న‌పెడితే ఇప్పుడు భూమా కుటుంబంలోనూ ఆస్తుల విష‌యంలో ర‌చ్చ జ‌రుగుతోంద‌ట‌.

భూమా నాగి రెడ్డి, శోభా రెడ్డిల చిన్న కూతురైన భూమా మౌనికా రెడ్డిని మంచు మ‌నోజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి ఇటీవ‌ల పండంటి ఆడ‌పిల్ల పుట్టింది. అయితే.. ఎప్పుడైతే మ‌నోజ్ త‌న‌కు ఇంకా ఆస్తులు రావాల్సి ఉన్నాయ‌ని త‌న తండ్రి సోద‌రుడితో అన‌డంతో.. మౌనిక కూడా త‌న సోద‌రి అఖిల ప్రియ‌ను త‌న ఆస్తి త్వ‌ర‌గా త‌న‌కు రాసివ్వాల‌ని ఫోర్స్ చేస్తోంద‌ట‌. నాగి రెడ్డి, శోభా రెడ్డిల‌కు ముగ్గురు సంతానం. అఖిల ప్రియ‌, మౌనిక, జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డి. అఖిల ప్రియ త‌న త‌ల్లిదండ్రుల్లానే రాజ‌కీయాల్లో రాణించాల‌నుకున్నారు. అలా తెలుగు దేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు.

Bhuma Mounika Reddy త‌ల్లిదండ్రులు లేక‌పోవ‌డంతో అఖిల ప్రియే ఇంటి పెద్ద‌గా ఉంటూ సోద‌రిని, త‌మ్ముడిని చూసుకుంటున్నారు. మౌనిక‌కు పెళ్లి అయిపోవ‌డంతో ఇక ఆస్తుల పంప‌కాల విష‌యంలో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. త‌న‌కు రావాల్సిన ఆస్తి త‌న‌కు ఇవ్వాలంటూ మౌనిక అఖిల‌ను అడిగారు. ఇస్తాను ఇస్తాను అంటున్నారు కానీ అఖిల ప్రియ ఏ సంగ‌తి తేల్చ‌డం లేద‌ట‌. అయితే.. ఇటీవ‌ల మౌనిక‌కు త‌న ఆస్తుల విష‌యంలో ఓ షాకింగ్ విష‌యం తెలిసింద‌ట‌. కొన్ని ఆస్తుల విష‌యంలో మౌనిక‌కు తెలీకుండా ఆమె సంత‌కాలు ఫోర్జ‌రీ చేసార‌ని.. పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని డిపాజిట్లు కూడా చేసార‌ని తెలుస్తోంది. నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌లోని ప‌ద్మావ‌తి న‌గ‌ర్‌లో ఉన్న రూ.4 కోట్ల విలువైన భూమి విష‌యంలో మౌనిక సంత‌కాలు ఫోర్జ‌రీ చేసార‌ట‌. ఈ విష‌యం మౌనిక‌కు తెలీడంతో ఆమె షాక్‌కు గురయ్యార‌ట‌. వెంట‌నే ఈ విష‌యాన్ని అఖిల ప్రియ దృష్టికి తీసుకెళ్లారు. త‌న‌కు రావాల్సిన ఆస్తుల విష‌యంలో క్లారిటీ ఉండాల‌ని.. త‌న‌కు తెలీకుండా సంత‌కాలు ఫోర్జ‌రీ చేసిన‌ట్లు తెలిస్తే న్యాయ‌ప‌రంగా ముందుకెళ్తాన‌ని హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం.

More News

Pawan Kalyan congratulates mana shankara vara prasad movie
అన్న సినిమాకు శుభాకాంక్ష‌లు
BySai KrishnaJan 22, 2026

Pawan Kalyan మెగా బ్లాక్‌బస్టర్‌ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందానికి ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ శుభాకాంక్షలు…

Renu Desai fires on assholes who are killing stray dogs
మ‌గాళ్లంద‌రినీ చంపాలి క‌దా?
BySai KrishnaJan 19, 2026

Renu Desai హైద‌రాబాద్‌లో వంద‌లాది కుక్క‌ల‌కి విషం పెట్టి చంపుతున్న ఘ‌ట‌న‌లు ఎక్కువైపోతుండ‌డంతో తొలిసారి న‌టి రేణూ దేశాయ్ మీడియా…

Renu Desai is enjoying her spiritual trip in kashi
కాశీలో రేణూ దేశాయ్‌.. Z+ సెక్యూరిటీ ఇచ్చింది ఎవ‌రో తెలుసా?
BySai KrishnaJan 17, 2026

Renu Desai న‌టి రేణూ దేశాయ్ కాశీలో త‌న స్పిరిచువ‌ల్ ట్రిప్‌ను ప్ర‌శాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆమె…

Dhanush Mrunal Thakur Marriage on february 14
వ్యాలెంటైన్స్ డే రోజు పెళ్లి?
BySai KrishnaJan 15, 2026

Dhanush Mrunal Thakur Marriage ప్ర‌ముఖ న‌టుడు ధ‌నుష్‌.. న‌టి మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు కొంత‌కాలంగా పుకార్లు వినిపిస్తున్న…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top