Gautam Adani Case భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చి తన సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు అమెరికాకి చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అదానీపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. అయితే.. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ప్రభుత్వ అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సోలార్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కాంట్రాక్టులను ఇప్పించేందుకు ఆ ప్రభుత్వ అధికారే మధ్యవర్తిగా వ్యవహరించారట.
ఆయన్ను అమెరికా ఫెడరల్ అధికారులు “Foreign Official #1” అని సంబోధిస్తున్నారు. 2021లో ఆగస్ట్ 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20వ తేదీల్లో ఆ అధికారిని అదానీ కలిసారట. ఈ మీటింగ్‌ల కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యుత్ కంపెనీలు SECIతో PSA (పవర్ సప్లై అగ్రిమెంట్లు) కుదుర్చుకున్నట్లు ఆరోపిస్తున్నారు. 2021 డిసెంబర్ 1 నాటికి ఏపీ ప్రభుత్వం SECIతో 2.3 గిగావాట్ల సోలార్ పవర్ దక్కించుకునేలా PSAను ఫైనలైజ్ చేసింది. ఇది రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లలోనే అతిపెద్ద ఒప్పందం.
ఈ డీల్ కోసం అదానీ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే రూ.1750 కోట్లు లంచం ఇచ్చారట. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గతంలో కాంగ్రెస్ పాలించిన ఛత్తీస్‌గడ్, ఒడిశా (BJD), తమిళనాడు (DMK), జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఓపక్క అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే.. భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అమిత్ మాల్వియా కాంగ్రెస్ అదానీ నుంచి ముడుపులు అందుకుంటే మధ్యలో తమ పార్టీపై నిందలేస్తారేంటి అని మండిపడ్డారు.
సరిగ్గా పార్లమెంట్ సమావేశాలు జరగడానికి ముందు అమెరికాకి చెందిన ఫెడరల్ అధికారులు అదానీపై కేసు పెట్టడం.. అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేసారు.