Search The Query
Search

Image
  • Home
  • Cinema
  • Allu Arjun Father బ‌న్నీ కోసం ఢిల్లీకి అర‌వింద్.. కాంగ్రెస్ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు

Allu Arjun Father బ‌న్నీ కోసం ఢిల్లీకి అర‌వింద్.. కాంగ్రెస్ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు

Allu Arjun Father ప్ర‌ముఖ నిర్మాత‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అల్లు అర‌వింద్ రాజ‌ధాని ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్ప 2 (Pushpa 2) రిలీజ్ స‌మ‌యంలో.. సంధ్యా థియేట‌ర్ (Sandhya Theatre) వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఓ మ‌హిళ మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆమె కుమారుడు చావు బ‌తుకుల మ‌ధ్య హాస్పిట‌ల్‌లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్‌పై కేసు న‌మోద‌వ్వ‌డం.. ఆయ‌న్ను అరెస్ట్ చేసి చంచల‌గూడ జైలుకు త‌ర‌లించ‌డం.. ఆ త‌ర్వాత కొన్ని గంట‌ల్లోనే బెయిల్ రావ‌డం జ‌రిగిపోయాయి. అయితే అల్లు అర్జున్‌కి కేవ‌లం నాలుగు వారాలు మాత్ర‌మే బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ రిమాండ్‌కి వెళ్లాల్సిందే.

అల్లు అర్జున్‌ని ఎలాగైనా కేసు నుంచి త‌ప్పించేందుకు అర‌వింద్ ఎన్నో పాట్లు ప‌డుతున్నారు. ఇదేదో చిన్న మ్యాట‌ర్ అయ్యుంటే అంత టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌ని లేదు. కానీ ఇక్కడ ఓ మ‌హిళ ప్రాణం పోయింది. ఆమె కొడుకు ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఆ కుటుంబానికి అల్లు అర్జున్ రూ.25 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించారు. అలాగ‌ని ఈ కేసుని వ‌దిలేయ‌లేరు క‌దా. పైగా ఆ చ‌నిపోయిన మ‌హిళ భ‌ర్త మీడియా ముందుకు వ‌చ్చి త‌న భార్య చావుకు కార‌ణం అల్లు అర్జునే అని చెప్తూ క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. దాంతో ఈ కేసు ఇంకా స్ట్రాంగ్‌గా మారింది. ఓ మ‌హిళ ప్రాణం పోయింది అన‌గానే ప‌రిహారం ఇచ్చేస్తారు కేసు క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వ‌డం జాతీయ స్థాయిలో సంచ‌ల‌నంగా మారింది.

ఢిల్లీకి అర‌వింద్

Allu Arjun Father దాంతో అల్లు అరవింద్ ఢిల్లీకి వెళ్ల‌నున్నార‌ట‌. ఎందుకంటే.. ఈ కేసు విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాస్త సీరియస్‌గా ఉన్నార‌న్న విష‌యం కూడా స్ప‌ష్టంగా తెలుస్తోంది. పుష్ప 2 స‌క్సెస్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మ‌ర్చిపోవ‌డం.. ఆ త‌ర్వాత గొంతు పాడైంద‌న్న సాకుతో నీళ్లు తాగ‌డం.. ఆ త‌ర్వాత పేరు తెచ్చుకుని రేవంత్ రెడ్డి గురించి ప్ర‌స్తావిస్తూ ఆయ‌నకు ధ‌న్య‌వాదాలు చెప్ప‌డం వైర‌ల్‌గా మారింది. తెలంగాణ‌లో పుష్ప 2 కు టికెట్ రేట్లు పెంచితే త‌న పేరునే మ‌ర్చిపోతాడా అన్న కోపంతో కావాల‌ని అల్లు అర్జున్‌ని శుక్ర‌వారం అరెస్ట్ చేయించార‌న్న టాక్ కూడా ఉంది. శుక్ర‌వారం అరెస్ట్ చేస్తే శ‌నివారం, ఆదివారాల్లో కోర్టుకి సెల‌వు కాబ‌ట్టి బెయిల్ కోసం వెళ్ల‌లేర‌ని ప్లాన్ వేసి మ‌రీ శుక్ర‌వారం అరెస్ట్ చేయించారు. కానీ అల్లు అర‌వింద్ వెంట‌నే నాంప‌ల్లి హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేయించి మ‌రీ రూ. 4 కోట్లు ఖ‌ర్చు చేసి బెయిల్ తెప్పించుకున్నారు.

వాదోప‌వాదాలు విన్న కోర్టు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అల్లు అర్జున్ రిమాండ్‌కి వెళ్లాల్సిందే. దాంతో ఈ కేసు విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాస్త త‌గ్గితే బాగుంటుంద‌ని భావించిన అల్లు అర‌వింద్.. స్వ‌యంగా ఆయ‌న్ను క‌లిసి మాట్లాడ‌టం కంటే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్ద‌ల‌తో మాట్లాడితే త‌న కొడుకు బ‌య‌ట‌ప‌డ‌తాడు అని భావిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీకి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కేసు వాపసు తీసుకుంటా

అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యార‌ని తెలిసి ఆయ‌న‌పై పెట్టిన కేసును వాప‌సు తీసుకుంటాన‌ని అన్నారు మృతురాలి భ‌ర్త‌. త‌న‌కు అల్లుఅ ర్జున్ అరెస్ట్ అయిన‌ట్లు తెలీద‌ని.. ఆయ‌న‌పై పెట్టిన కేసును వాప‌సు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని అన్నారు. మ‌రోప‌క్క అల్లు అర్జున్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేక‌పోయారు. న్యాయ‌ప‌రమైన కార‌ణాల దృష్ట్యా తాను రాలేక‌పోతున్నాన‌ని లేఖ రాసారు. దాంతో అల్లు అర‌వింద్ శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించి బాలుడి తండ్రికి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. శ్రీతేజ్ మెడిక‌ల్ ఖ‌ర్చుల‌న్నీ తామే భ‌ర్తిస్తామ‌ని.. ఇచ్చిన ప‌రిహారం కాకుండా ఇంకేం కావాల‌న్నా కూడా సాయం చేసేందుకు రెడీగా ఉన్నామ‌ని అన్నారు.

More News

Tharun Bhasker Eesha Rebba
Tharun Bhasker Eesha Rebba: 2026లో వివాహం!
BySai KrishnaDec 13, 2025

Tharun Bhasker Eesha Rebba: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్ భాస్క‌ర్ 2026లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. న‌టి ఈషా రెబ్బాతో…

Sydney Sweeney talks about her breasts
Sydney Sweeney: వ‌క్షోజాల‌కు లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌
BySai KrishnaDec 12, 2025

Sydney Sweeney: ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి సిడ్నీ స్వీనీ వ‌క్షోజాల విష‌యంపై లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష జ‌రగ‌డం సంచ‌ల‌నంగా మారింది.…

Actress Hema
Hema: న‌టి హేమ ఇంట విషాదం
BySai KrishnaNov 18, 2025

Hema: టాలీవుడ్ న‌టి హేమ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె త‌ల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం…

Actress Tulasi
Senior Actress Tulasi: సినిమాల‌కు గుడ్‌ బై
BySai KrishnaNov 18, 2025

Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన సీనియ‌ర్ న‌టి తుల‌సి యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top