Fictosexuality ఒకప్పుడు మగవాళ్లు ఆడవాళ్లను ఆడవాళ్లు మగవాళ్లను ప్రేమించుకోవడం మాత్రమే చూసాం. ఈ మధ్యకాలంలో LGBTQ అనే కొత్త జెండర్ వచ్చింది. అఫ్కోర్స్ వాళ్లని వారి అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి. కానీ ఇప్పుడిప్పుడే కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటో తెలుసా.. ఫిక్టోసెక్సువాలిటీ. సెక్సువాలిటీ వరకు మీకు అర్థమై ఉంటుంది. మరి ఫిక్టో ఏంటి అనుకుంటున్నారా? ఫిక్టోసెక్సువాలిటీ అంటే.. ఫిక్షనల్ క్యారెక్టర్స్‌తో ప్రేమలో పడేవాళ్లను ఇలా పిలుస్తారు.
మన దేశంలో ఇలాంటి ట్రెండ్ వచ్చిందో లేదో తెలీదు కానీ విదేశాల్లో ఆల్రెడీ పాకేసింది. వాళ్లు చూసే టీవీ షోలు, సినిమాల్లోని ఫిక్షనల్ క్యారెక్టర్స్‌తో ప్రేమలో పడిపోతున్నారు. వీరిలో కొందరు మనుషులకు దూరంగా ఉంటున్నారు. అంటే ఇక వేరే వాళ్లని ప్రేమించలేకపోతున్నారు. ఇందుకు కారణం.. మనుషులు ప్రేమలో మోసం చేస్తారు.. ఫిక్షనల్ క్యారెక్టర్స్ అలా చేయవని నమ్ముతున్నారట. ఇటీవల ఒక విదేశీ యువతి హోలోగ్రామ్ ద్వారా రూపొందించిన ఒక అబ్బాయి రూపాన్ని ప్రేమించి దానినే పెళ్లి చేసుకుంది.
సింపుల్‌గా వాళ్ల ఉద్దేశం ఏంటంటే.. ప్రేమ అంటే కేవలం మనిషి పట్ల ఉండేదే కాదు అని. అయితే.. ఇలాంటి వాళ్లు అలాంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ని ప్రేమించడమే తప్ప వారితో సెక్స్ మాత్రం చేయలేరు. వాళ్లని ఊహించుకుంటూ తమని తాము సంతృప్తి పరుచుకుంటూ ఉంటారట.
ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మరో విషయం ఏంటంటే.. కోర్మాన్స్. రొమాన్స్ గురించి విన్నాం కానీ ఈ కోర్మాన్స్ ఏంటండీ బాబూ అనుకుంటున్నారా? కోర్స్ (Chores) అంటే మనం రోజూవారీ చేసుకునే పనులు. అంటే సరుకులు కొనుక్కోవడం.. ఇంటి పనులు, జిమ్‌కి వెళ్లడం. అంటే.. భాగస్వామ్యులు ఇంట్లో కంటే ఇలాంటి కోర్స్ కలిసి చేస్తున్నప్పుడు అంటే.. ఇద్దరూ కలిసి షాపింగ్‌కి వెళ్లడం.. సూపర్ మార్కెట్‌కి వెళ్లడం.. జిమ్‌కి వెళ్లడం.. కుక్కను వాకింగ్‌కి తీసుకెళ్లడం.. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వారి మధ్య రొమాంటిక్ సంభాషణలు ఎక్కువగా జరుగుతుంటాయట. ఇలాంటివి ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లుంటే జరగవని అంటున్నారు.





