Affair ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు పొందేందుకు ఒక మహిళా లాయర్‌ను మాట్లాడుకున్నాడు. కేసు పెండింగ్‌లో ఉండగానే లాయర్‌తో అఫైర్ పెట్టుకున్నాడు. మొత్తానికి అతనికి తన భార్యతో విడాకులు మంజూరయ్యాయి. అయితే.. కొన్ని నెలల తర్వాత తనను మోసం చేసాడంటూ ఆ విడాకులు ఇప్పించిన లాయరే అతనిపై మళ్లీ కేసు వేసింది. దాంతో న్యాయస్థానంలో ఒక ఫ్యామిలీ డ్రామాకు తెరలేచింది.
ఆ వ్యక్తి లండన్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ కేసు మాత్రం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే.. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి బీవీ నాగరత్న ఇందులో ఎక్కడా మోసం లాంటివి లేవని.. ఇద్దరూ పరస్పర ఇష్టం, అనుమతితోనే రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. ఇద్దరి మధ్య జరిగిన గొడవను లాయర్ అవకాశంగా తీసుకుని కేసు వేసారని అన్నారు. ఆ వ్యక్తికి ముందస్తు బెయిల్‌ను కూడా మంజూరు చేసారు. అయితే.. తన కేసును తనే వాదించుకుంటున్న సమయంలో న్యాయమూర్తి బీవీ నాగరత్న.. అతని తరఫున న్యాయవాదిగా ఉంటూ అసలెందుకు ఈ మురికిలో ఇరుక్కున్నావమ్మా అని అడగడం ఆసక్తికరంగా మారింది.





