Republic Day జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26-26 కోడ్‌తో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసాయి.
ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహకారంతో పంజాబ్‌కి చెందిన గ్యాంగ్‌స్టర్ల సాయంతో జైషే మహ్మద్, లష్కరే తైబా ఉగ్రసంస్థలు ఈ దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది. దాంతో ఢిల్లీ హై అలర్ట్‌లో ఉంది.
రామ మందిరం, రఘునాథ ఆలయాలు టార్గెట్‌లుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు, నిఘా వర్గాలు ఢిల్లీతో పాటు జనాభా ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలను అంటిస్తున్నారు. బస్సు, రైల్వే స్టేషన్లలో నిఘా పెంచారు.
ప్రస్తుతం పోలీసుల నిఘా ఈ అనుమానితులపై ఉంది
మహ్మద్ రెహాన్
మహ్మద్ ఉమర్
అబు సుఫియా
మహ్మద్ షాహిత్ ఫైసల్
సయ్యద్ అర్షియా
షార్జీల్ అఖ్తర్





