Moon చంద్రుడిపై హోటల్ బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? బుకింగ్స్ అయితే మొదలైపోయాయి. బుకింగ్ ధర ఒక్కో వ్యక్తికి రూ.2.2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంది.
అమెరికాకి చెందిన GRU స్పేస్ అనే స్టార్టప్ సంస్థ ఈ ప్లాన్ వేసింది. 2032 నాటికి చంద్రుడిపై హోటల్ రెడీ అయిపోతుంది. ఒక వేళ ఫుల్ మూన్ ట్రిప్ కావాలనుకుంటే ఒక్కొక్కరు రూ. 90 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఇందుకోసం రూ.80,000 వరకు అప్లికేషన్ రుసుం చెల్లించాలి. ఇది నాన్ రీఫండబుల్. ఈ హోటల్ నిర్మించేందుకు కావాల్సిన సామాగ్రిని చంద్రుడిపైకి 2029లో పంపిస్తారు.
హోటల్ నిర్మాణంలో సాధారణ మట్టి కాకుండా చంద్రుడిపై దొరికే మట్టితోనే ఇటుకలు నిర్మిస్తారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2032లో సాధారణ మనుషులు చంద్రుడిపై నివసించవచ్చు.





