Narendra Modi భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన బాస్ నితినే అని.. తాను కేవలం పనోడినని ఆయన వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది.
పార్టీ బాధ్యతలను పటిష్ఠంగా ముందుకు తీసుకెళ్లే యువ నేత నితిన్ అని ఆయన్ను కొనియాడారు. భారతదేశంలో ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులను కళ్లారా చూసిన వ్యక్తి నితిన్ అని అందుకే ఆయనే జాతీయ అధ్యక్షుడు అయితే బాగుంటుందనిపించిందని తెలిపారు. బిహార్‌లోని బంకిపురి నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లూ గెలిచిన నేత నబిన్.





