Crime News సర్.. నా భార్యను చంపేసాను. దాని శవం ఇంట్లోనే పడి ఉంది.. అంటూ పై ఫోటోలో కుడి వైపు కనిపిస్తున్న కుర్రాడు పోలీసుల వద్దకు వెళ్లి ఏడ్చాడు. దాంతో పోలీసులు షాకై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది?
పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్వేత. అబ్బాయి పేరు సచిన్. ఇద్దరి వయసు 22 ఉంటాయేమో. ప్రేమించి ఇంట్లో వాళ్లని ఎదిరించి మరీ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేహ్‌పూర్ జిల్లాకి చెందిన వీరిద్దరూ పెళ్లి తర్వాత ఏదన్నా పని చేసుకుని బతకాలన్న ఉద్దేశంతో గుజరాత్‌లోని సూరత్‌కు షిఫ్ట్ అయ్యారు.
సూరత్‌లో సచిన్ ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు వెళ్లిపోయారు. సచిన్ ఆటో నడుపుతూ భార్యను పోషిస్తున్నాడు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో శ్వేత ఖాతాలోకి వేలకు వేలు డబ్బులు పడుతుండడం సచిన్ గమనించాడు. అసలు శ్వేత ఉద్యోగం చేయడం లేదు. అలాంటప్పుడు ఆమెకు డబ్బులు ఎలా వస్తున్నాయి?
ఇదే విషయాన్ని శ్వేతను అడిగాడు. దీనికి శ్వేత తన అవసరాల కోసం తండ్రి డబ్బులు పంపుతున్నాడని చెప్పింది. సచిన్‌కు శ్వేత ఇచ్చిన సమాధానం నమ్మశక్యంగా అనిపించలేదు. ఆమెపై ఓ కన్నేసి ఉంచాడు. ఓసారి స్నేహితుల ఇంట్లో పార్టీ ఉందని.. రాత్రి వచ్చే సరికి ఆలస్యం అవుతుందని సచిన్ కావాలనే శ్వేతకు చెప్పి వెళ్లాడు.
అలా బయటికి వెళ్లి రాత్రి 9 గంటల సమయంలో సచిన్ ఇంటికి వెళ్లి చూడగా.. శ్వేత మంచంపై మరో ఇద్దరు పరాయి మగాళ్లతో అసభ్యకరమైన స్థితిలో కనిపించింది. దాంతో సచిన్ కోపంతో ఊగిపోయాడు. శ్వేతతో గొడవపడ్డాడు. దాంతో పొరిగింటి వాళ్లు పోలీసులకు ఫోన్ చేయడంతో వారు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
కానీ సచిన్ ప్రేమించిన అమ్మాయి చేస్తున్న మోసం భరించలేకపోయాడు. ఎందుకిలా చేస్తున్నావ్ అని ఇంటికి వెళ్లాక ఆమెను నిలదీసాడు. దీనికి శ్వేత.. నాకు నీతో ఉండటం ఇష్టం లేదు. నువ్వు నన్ను చంపినా నేను వేరే అబ్బాయిలతోనే ఉంటాను అని చెప్పిందట. దాంతో కోపం పట్టలేక సచిన్ శ్వేత గొంతు నులిమి చంపేసాడు.
ఆ తర్వాత ఏం చేయాలో తెలీక నాలుగు గంటల పాటు రోడ్లపై తిరిగాడు. ఇక పారిపోయి తప్పించుకోవాల్సిన అవసరం లేదని భావించి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





