Renu Desai నటి రేణూ దేశాయ్ కాశీలో తన స్పిరిచువల్ ట్రిప్‌ను ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ పలు ఫోటోలను షేర్ చేసారు. అయితే.. కాశీలో తనకు Z+ సెక్యూరిటీ లభించిందట. ఎవరి నుంచో తెలుసా? కాశీ ఘాట్‌లలో నిరంతరం కాశీని కాపుకాస్తున్న అక్కడి శునకాలు.
కాశీలో తనకు ఎంతో ముద్దుగా ఉన్న ఈ శునకాలే Z+ సెక్యూరిటీని ఇచ్చాయి అంటూ రేణూ వెల్లడించారు. రేణూ మానసిక ప్రశాంతత కోసం తరచూ కాశీ వెళ్తుంటారు. ఈ విషయాన్ని ఆమె చాలా సార్లు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అంతేకాదు.. తన పిల్లలు అకీరా, ఆద్యలు పెద్దయ్యాక తన బాధ్యతలు తీరిపోయాక సన్యాసం తీసుకుని కాశీకి వెళ్లిపోతానని కూడా చెప్పారు.






