Narendra Modi భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టనున్నారు. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ప్రధానులు ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్‌లో ఉన్న సౌత్ బ్లాక్‌లోని కార్యాలయంలోనే ఉంటూ వస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి ఒక ప్రధాని ఆ సౌత్ బ్లాక్‌ను వదిలి వేరే కార్యాలయంలోకి అడుగుపెడుతుండడం ఆసక్తిని సంతరించుకుంది. మకర సంక్రాంతి రోజున మోదీ తన కొత్త కార్యాలయంలోకి అడుగుపెడుతున్నారు.
సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కార్యాలయాన్ని ఎల్ అండ్ టీ నిర్మించింది. దీని నిర్మాణ విలువ రూ.1,189 కోట్లు. ఈ కార్యాలయం మొత్తం 2.26 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. మోదీ నివసించబోయే కార్యాలయం పేరు సేవా తీర్థ్-1. ఆల్రెడీ కేబినెట్ సెక్రటేరియట్ కార్యాలయాన్ని కూడా ఇందులోనే మార్చేసారు. దీని పేరు సేవా తీర్థ్-2. ఇక్కడే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యాలయం కూడా ఉంది. దీనిని సేవా తీర్థ్ -3 అంటారు. ఈ డిజైన్ మొత్తానికి సేవా అని పేరు సజెస్ట్ చేసింది మోదీనే. ఎందుకంటే ప్రజలకు సేవ చేసేందుకు నిర్మించిన కార్యాలయం అని ఆయన అభిప్రాయం.
ఇక పాత కార్యాలయాలైన సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్‌లను మ్యూజియంలుగా మార్చనున్నారు. ఈ మ్యూజియకు యుగే యుగీ భారత సంగ్రహాలయ్ అని నామకరణం చేసారు. దీనిని మ్యూజియంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్రాన్స్‌కి చెందిన మ్యూజియం డెవలప్‌మెంట్ ఏజెన్సీని సంప్రదించింది.





