2026 T20 World Cup ఏషియా కప్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంటే ఆ ట్రోఫీని ఇవ్వకుండా దొంగలా పట్టుకుపోయిన వ్యక్తి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ. ఇప్పుడు వీడిని ఏదో మనం సాయం అడిగినట్లు T20 ప్రపంచ కప్ మా పాకిస్థాన్‌లో నిర్వహించండి అంటూ వచ్చాడు. అసలు T20 వరల్డ్ కప్ హోస్ట్ చేస్తున్న దేశాలు భారత్, శ్రీలంక. మధ్యలో పాక్‌ని ఎవడడిగాడు?
మనకు బంగ్లాదేశ్‌కు మధ్య ప్రస్తుతం ఉన్న రాజకీయ భిన్నాభిప్రాయాల కారణంగా ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఇండియాలోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఇందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒప్పుకోలేదు. ఇండియాలో కాకుండా శ్రీలంకలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఇందుకు ఐసీసీ ఒప్పుకోలేదు. ఆడితే ఇండియాకు వచ్చి ఆడండి.. లేదంటే పాయింట్లు కోల్పోండి అని అల్టిమేటం విధించింది.
ఈ క్రమంలో మోహ్సిన్ నఖ్వీ మీడియా ముందుకు వచ్చి ఆ T20 మ్యాచ్‌లు అన్నీ పాకిస్థాన్‌లో పెట్టండి.. మేం చూసుకుంటాం అని ప్రకటించాడు. అసలు ఏషియా కప్ ట్రోఫీ ఇప్పటివరకు భారత్‌కు చేర్చని మోహ్సిన్ నఖ్వీ ఇలా పెద్దమనిషిలా నేనున్నాను అని రావడం హాస్యాస్పదంగా ఉంది.





