Banglore Surgeon Murder: నెల రోజుల క్రితం బెంగళూరులో ఓ వైద్యుడు తన భార్యకు అనస్థీషియా ఇస్తూ చంపేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జనరల్ సర్జన్‌గా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి.. డెర్మటాలజిస్ట్ అయిన తన భార్య కృతికకు కొన్ని నెలలుగా అనస్థిటిక్ డ్రగ్ ఓవర్‌డోస్ ఇస్తూ రావడంతో ఆమె చనిపోయారు. అనారోగ్యంతో చనిపోయారు అని మహేందర్ రెడ్డి ఇంట్లో వాళ్లకి చెప్పినప్పటికీ పోస్ట్ మార్టెంలో అసలు విషయం బయటపడటంతో పోలీసుల అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. ఈ కేసు విచారణలో భాగంగా మహేందర్ రెడ్డి ఫోన్ అనాలసిస్ చేయగా.. నీ కోసమే నా భార్యను చంపేసాను అని ఓ యువతికి ఆయన మెసేజ్ చేసినట్లు తెలిసింది. అది కూడా కృతిక చనిపోయిన వెంటనే ఆ మెసేజ్ పంపాడట. అయితే ఆ యువతి ఎవరు ఏంటి అనే అంశాలపై విచారణ జరుగుతోంది. ఈ హత్య విషయమై పోలీసులు మహేందర్ రెడ్డిని విచారిస్తున్న సమయంలో అతను కృతికను చంపడానికి కారణం ఆమె తల్లిదండ్రులు, కృతిక తన వద్ద నిజాన్ని దాచారని.. కృతికకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పకుండా పెళ్లి చేసారని అన్నాడు.
పెళ్లయ్యాక కృతిక మాటిమాటికీ అనారోగ్యానికి గురవుతుంటే తనకు అనుమానం వచ్చి తానే రక్తపరీక్షలు నిర్వహించానని.. అప్పుడు ఆమెకు ఉన్న అనారోగ్య సమస్యలు తెలిసాయని అన్నాడు. నిజం దాచినందుకే కృతికకు ప్రోపోఫోల్ అనే అనస్థిటిక్ డ్రగ్‌ను తినే పదార్థాల్లో కలిపి ఇచ్చానని వెల్లడించాడు.





