Kantara Chapter 1 ప్రముఖ కన్నడ నటుడు రిషభ్ శెట్టి నటించిన కాంతార: చాప్టర్ 1 అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఇది 2022లో రిలీజ్ అయి సర్‌ప్రైజింగ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కాంతారకు ప్రీక్వెల్‌గా రానుంది. అయితే ఈ సినిమా చూడాలనుకునేవారికి చిత్రబృందం హోంబళే ఫిలిం కాంతార సంకల్పం పేరిట మూడు నియమాలు విధించిందట. సినిమా చూడటానికి ముందు రోజుల ముందు మందు తాగడం, మాంసం తినడం, పొగతాగడం వంటివి చేయకూడదంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొందరేమో సనాతన ధర్మం పేరిట సరైన నిర్ణయమే అంటుంటే.. ఇంకొందరేమో ఇది పిచ్చికి పరాకాష్ట అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే.. ఈ నియమాల ప్రకటనపై రిషభ్ స్పందించారు. అసలు హోంబళే సంస్థ నుంచి కానీ తన బృందం నుంచి కానీ ఇలాంటి నియమాల గురించి చర్చే రాలేదని.. ఆ నియమాల పోస్టర్ ఎవరు రిలీజ్ చేసారో తనకు తెలీదని అన్నారు. తినడం, తాగడం వంటివి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలని వాటికి ఎదురుచెప్పే హక్కు మరో పౌరుడికి ఉండదని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి సినిమాకు చెడ్డ పేరు తీసుకురావద్దని కోరారు.
కాంతార సినిమాను కేవలం కన్నడలో మాత్రమే రిలీజ్ చేసారు. కానీ ఆ సినిమాలో కాంతార వేషంలో ఓ…. అని అరిచే సన్నివేశం.. వరాహ రూపం అనే పాట అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. దాంతో ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయడంతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకుంది. అందుకే ఇప్పుడు కాంతార చాప్టర్ 1 సినిమాను రూ.125 కోట్ల బడ్జెట్‌తో గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఇందులో రిషభ్ శెట్టికి జంటగా రుక్మిణి వసంత్ నటించారు. పలువురు తమిళ, హిందీ నటులు కూడా ఇందులో ఉన్నారు. ఇప్పటికే మొన్న రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.