చెన్నైలో చ‌నిపోయిన పాకిస్థానీ

Pakistan: ఓ పాకిస్థానీ వాసి భార‌త్‌లో చ‌నిపోయాడు. కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆ వ్య‌క్తి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో నిన్న చ‌నిపోయిన‌ట్లు అధికారికంగా వెల్ల‌డించారు. 23 ఏళ్ల కుర్రాడు కొంత‌కాలంగా ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాడు. రెండు నెల‌ల క్రితం చికిత్స నిమిత్తం ఇక్క‌డికి వ‌చ్చాడు. అప్ప‌టి నుంచి ఎక్మో మీద ఉంచే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులు అత‌ని భౌతిక‌కాయాన్ని పాకిస్థాన్‌కు తీసుకెళ్లిపోయారు. ప‌హ‌ల్గాం దాడి నేప‌థ్యంలో భార‌త్‌లో ఉంటున్న పాక్ వాసులు వెళ్లిపోవాల్సిందిగా కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో ఆ కుర్రాడిని ఎక్మో స‌పోర్ట్ నుంచి తీసేసి పాక్‌కు త‌ర‌లిస్తే చ‌నిపోతాడ‌ని వైద్యులు చెప్ప‌డంతో అత‌న్ని ఇక్క‌డే ఉంచాల్సి వ‌చ్చింద‌ట‌. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *