Prabhas Spirit: సందీప్ రెడ్డి వంగా.. రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చేసాయి. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ పెట్టారు. ఇందులో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలుకానుంది. అయితే.. ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కి సంబంధించి ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.
ప్రభాస్‌ని తలుచుకోగాలనే ఎవరికైనా ఆరగుడల ఆజానుబాహుడు గుర్తొస్తాడు. అది బాడీ కాదురా బాక్సాఫీస్ అంటుంటారు. అలాంటి ప్రభాస్ లుక్స్‌తో సందీప్ రిస్క్ చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో ప్రభాస్‌ను మరీ సన్నగా చూపించబోతున్నాడట. ఈ మేరకు ప్రభాస్ డైటింగ్, తన ఆహార అలవాట్లు, వ్యాయామాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇందులో చాలా మటుకు స్టంట్స్‌ని ప్రభాసే డూప్ లేకుండా చేయబోతున్నారు.
స్క్రిప్ట్ బాగా నచ్చడంతో సినిమా కోసం ఏదైనా చేస్తానని ప్రభాస్ సందీప్‌కు సరెండర్ అయిపోయారు. ఇక ఇందులో దక్షిణ కొరియాకి చెందిన యాక్షన్ కింగ్ మా డాంగ్ సియోక్ విలన్‌గా నటించనున్నాడు. ఈ సినిమాలో ఆయన్ను ఎలాగైనా పెట్టి ప్రభాస్ చేత ఫైట్స్ చేయించాల్సిందే అని సందీప్ ఫిక్స్ అవ్వడంతో మా డాంగ్ అడిగినంత భారీ పారితోషికాన్ని కూడా ఇవ్వడానికి వెనుకాడలేదట నిర్మాతలు. ఇక త్వరగా అనుకున్న సమయానికి షూటింగ్ అయిపోతే స్పిరిట్ సినిమా 2027లో రిలీజ్ అవుతుంది.