CSK vs KKR: చెన్నై సూపర్ కింగ్స్‌కి మళ్లీ ధోనీ కెప్టెన్ అయితే ఆ టీం దశ మారిపోతుందనుకున్నారు. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతికి గాయం కావడంతో.. తాత్కాలిక కెప్టెన్‌గా ధోనీ నియమితులైన సంగతి తెలిసిందే. మళ్లీ ధోనీ కెప్టెన్సీ అనగానే అభిమానులు ఇక టీం అన్ని మ్యాచ్‌లలో గెలిచేస్తుంది అనుకున్నారు. కానీ అంతా తుస్సైంది. నిన్న కలకత్తాకు చెన్నైకు మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘోర ఓటమి పాలైంది. దాంతో ధోనీని ఎంతో ఆరాధించే అభిమానులు కూడా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
సరే.. నెటిజన్లు అలా ట్రోల్ చేయడం కొత్తేం కాదు. కానీ లైవ్‌లో ఓ మాజీ క్రికెటర్ ధోనీని ట్రోల్ చేయడం చాలా దారుణం. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడంతో కమెంటేటర్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిధూ ధోనీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ధోనీ మళ్లీ కెప్టెన్ అయ్యాడు.. సింహం గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్నాడు అని అందరూ కేకలు వేసారు. కానీ అక్కడ ఏమీ లేదు. అంతా డొల్లే. కొండని తవ్వి ఎలుకను తెచ్చినట్లు అయ్యింది అని ఆయన కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారాయి.