Pawan Kalyan: సింగపూర్‌లోని టొమాటో కుకింగ్ స్కూల్‌లో మంటలు వ్యాపించడంతో.. అక్కడ ఉన్న తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విషయం తెలిసిన వెంటనే చాలా భయమేసిందని.. తన భార్య ఆన్నా భయంతో వణికిపోతోందని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలీదని.. అందుకే తన పర్యటనలను సగంలోనే వదిలేసి సింగపూర్ వెళ్తున్నానని అన్నారు.
చేతికి గాయం కావడంతో పాటు దట్టమైన పొగ కమ్మేయడంతో అది పీల్చేసరికి ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడినట్లు సమాచారం అందిందని.. ఇందుకోసం వైద్యులు బ్రాంకోస్కోపీ చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. ఈ విష యంలో కాస్త భయంగా ఉందని అన్నారు. ఈ ఘటనలో ఓ బాలిక మృతిచెందిందని.. అది తనను చాలా బాధించిందని పేర్కొన్నారు. కాసేపట్లో చిరంజీవి, సురేఖ దంపతులు కూడా సింగపూర్ బయలుదేరనున్నారు.