Naga Chaitanya On Negative PR: టాలీవుడ్లో నెగిటివ్ పీఆర్లు చేసే ప్రచారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక టాప్ హీరో సినిమా వస్తోందంటే.. మరో హీరో ఫ్యాన్స్ ఆ సినిమాపై తప్పుడు ప్రచారాలు చేసి ఫ్లాప్ టాక్ వచ్చేలా చేస్తుంటారు. ఇది ప్రతి సినిమా రిలీజ్ సమయంలో చూస్తూనే ఉంటాం. ఇది ఎక్కువగా టాప్ హీరోలకే జరుగుతుంటుంది. మొన్న రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఆ సినిమాపై మరో హీరో రూ.4 కోట్లు ఖర్చు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేయించాడంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ నెగిటివ్ ప్రచారాల వల్లే సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చి యావరేజ్ హిట్‌గా నిలిచిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కావాలనే నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారని కొందరు ఫ్యాన్స్ సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చారంటే సినీ రంగంలో నెగిటివ్ పీఆర్ దందా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అక్కినేని నాగచైతన్య స్పందించారు. తండేల్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. నెగిటివ్ పీఆర్ అనేది నిజమే అని అది టాలీవుడ్లో చాలా ఎక్కువగా ఉందని అన్నారు. సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పర్సనల్ పీఆర్‌ల చేత సినిమాలు ప్రచారాలు చేయిస్తుంటామని.. ఎందుకంటే ఆ ప్రచారం లేకపోతే సినిమా ఎంత బాగా ఉన్నా ఆడియన్స్‌కు రీచ్ అవ్వదని అన్నారు.
Naga Chaitanya On Negative PR అయితే.. కొందరు హీరోలు పీఆర్‌ను పాజిటివ్‌గా తమ కోసం కాకుండా.. ఇతర హీరోలను కిందికి లాగాలని.. వారి సినిమాలు ఫ్లాప్ అవ్వాలని డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేయిస్తుంటారని.. అది అస్సలు మంచి పద్ధతి కాదని అన్నారు. మరో హీరో జీవితం నాశనం చేసే బదులు ఆ డబ్బుని మంచి కోసం వాడితే బాగుంటుందని.. మరీ డబ్బులు ఎక్కువైపోతే ఛారిటీలకు విరాళంగా ఇవ్వాలని అన్నారు. అంతేకానీ.. ఒక హీరో పతనం అవ్వాలని చేయడం అనేది కరెక్ట్ కాదని తెలిపారు. సాధారణంగా నాగచైతన్య ఇలాంటి అంశాల గురించి బయట మాట్లాడరు. అసలు ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయని ఆయనకు తెలుసో లేదో అనేంతగా ఆయన తన ప్రొఫెషనల్ లైఫ్‌ని మెయింటైన్ చేస్తుంటారు. అలాంటి నాగచైతన్య ఒక హీరో మరో హీరోపై నెగిటివ్ ప్రచారం చేయిస్తుంటాడు అని చెప్పడం సంచలనంగా మారింది.
నెగిటివ్ ప్రచారం నాగచైతన్యపై జరిగిందా?
ఇప్పటివరకు తన కెరీర్లో తనపై నెగిటివ్ ప్రచారం జరగడం అనేది చూడలేదని అన్నారు నాగచైతన్య. తనపై ఏదన్నా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది అంటే తన పెళ్లి గురించే అని తెలిపారు. సమంతతో తాను విడిపోవడం అనేది నిజంగా జీర్ణించుకోలేని విషయమే అని..కానీ తనకు అదృష్టం బాగుండి మరోసారి ప్రేమ దొరికినప్పుడు తన జీవితాన్ని శోభితతో హాయిగా గడుపుతున్నానని.. అదే విధంగా సమంత తాను ఎంచుకున్న దారిలో సంతోషంగా ఉన్నప్పుడు తనపై తన కుటుంబంపై శాపనార్థాలు పెట్టే వారికి నొప్పేంటో అర్థంకావడం లేదని తెలిపారు. అనవసరంగా శోభితను ఆడిపోసుకుంటున్నారని.. కానీ ఇవన్నీ తాను భరిస్తూ ఇంత దృఢంగా తనతో ఉందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం అని.. శోభిత తన జీవితంలో రియల్ హీరో అని అన్నారు.