Panipuri: అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది.. ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం.. ఇలాంటి అంశాలు కొందరికి అస్సలు పట్టవని పై ఫోటోలో కనిపిస్తున్న మహిళను చూస్తే అర్థంచేసుకోవచ్చు. అనివార్య కారణాల వల్ల ట్రాఫిక్ నిలిచిపోతేనే వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు నరకయాతన పడుతుంటారు. కానీ తనకు ఎదురైన సిల్లీ సమస్య వల్ల ఇలా నడి రోడ్డుపై బైఠాయించి రచ్చ చేసేవారిని ఏ చెప్పుతో కొట్టాలి? ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ మహిళ స్థానిక పానీపూరీ బండి దగ్గరికి వెళ్లి రూ.20 పానీపూరీ తినింది. అయితే.. అక్కడ రూ.20కి 6 పానీపూరీలు ఇస్తారట.
కానీ ఆ మహిళకు మాత్రం నాలుగే ఇచ్చాడట. మిగతా రెండు ఏవి అని అడిగితే అంతే వస్తాయి అన్నాడట. పోనీలే అని వదిలేయకుండా.. అక్కడే నడిరోడ్డుపై బైఠాయించింది. రోడ్డుపై వాహనదారులు పక్క నుంచి వెళ్లలేక అవస్థ పడ్డారు. ట్రాఫిక్ పోలీస్ గమనించి వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి తరలించేందుకు యత్నించగా.. ఏడవటం మొదలుపెట్టింది. నాకు రావాల్సిన రెండు పూరీలు ఇప్పించే వరకు ఇక్కడి నుంచి కదలను అని మారాం చేసింది. దాదాపు అరగంట పాటు పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. ఇలా చేస్తే కేసు నమోదు చేయాల్సి వస్తుంది అని చెప్పడంతో ఆమె ఎట్టకేలకు లేచి వెళ్లిపోయారు. ఆ సమయంలో వాహన చోదకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పుడు చెప్పండి.. ఇలా బాధ్యత లేకుండా పనికిమాలిన పనులు చేస్తూ రోడ్లపై నాన్సెన్స్ క్రియేట్ చేసేవారిని ఊరికే వదిలేయాలా?