Woman Marry Each Other: పై ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలను చూసారా.. వారి భర్తలతో వేగలేకపోతున్నారట. కారణం రోజూ తాగి ఇంటికి రావడం.. వాళ్లను టార్చర్ పెట్టడం. దాంతో వారిద్దరూ తమ భర్తలతో విసిగిపోయారు. ఇంట్లో నుంచి పారిపోయి ఇక మరో మగాడు తమ జీవితంలో వద్దు అనుకుని వాళ్లే పెళ్లి చేసేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వారి పేర్లు కవిత, గుంజ. ముందు వారిద్దరికీ అసలు పరిచయమే లేదు. ఇద్దరూ ఉత్తర్‌ప్రదేశ్ వాసులే. అయితే వారిద్దరికీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయి. అలా ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరి బాధలను ఒకరు పంచుకున్నారు. వారికున్న బాధల్లో కామన్ పాయింట్ వారి భర్తలు.
వారిద్దరు భర్తలు తాగి వచ్చి ఇద్దరినీ టార్చర్ పెడుతున్నారట. దాంతో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మరో మగాడిని పెళ్లి చేసుకోవడం కంటే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి తామే పెళ్లి చేసుకోవాలని. అలా నిన్న రాత్రి ఇంట్లో నుంచి పారిపోయి చోటా కాశీ అనే ప్రాంతంలో కలుసుకున్నారు. అక్కడి శివాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నామని వారికి వారే ప్రకటించేసుకున్నారు. వారిద్దరూ అలా గుడిలో దండలు మార్చుకుంటుంటే అక్కడి పూజారి కూడా షాకయ్యాడు. పాపం ఆ షాక్‌లో ఆయనేమీ మాట్లాడలేకపోయాడు. ఎవరో స్థానిక మీడియా వర్గాలకు ఫోన్ చేయడంతో వారు వెళ్లి ఈ విషయాన్ని బయటపెట్టారు. (Woman Marry Each Other)
ఇలా చేసినందుకు తామేమీ సిగ్గుపడటం లేదని.. తామేమీ లెస్బియన్స్ కాదని అన్నారు. ఒకవేళ నిజంగానే భర్తలతో సమస్య ఉన్నప్పుడు వారి నుంచి విడిపోయి అక్కాచెల్లెళ్లులాగో లేదా స్నేహితులు గానో కలిసి ఉంటే తప్పు లేదు. ఇలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అడిగితే మాత్రం మా ఇష్టం అంటున్నారట. వారిద్దరూ ప్రస్తుతం ఒక చిన్న ఇంటి కోసం వెతుక్కుంటున్నారు. ఇల్లు దొరికాక ఏదన్నా పని వెతుక్కుని తమ బతుకు తాము బతుకుతాం అంటున్నారు. అయితే వీరికి పిల్లలు కూడా ఉన్నారు. మరి వారి సంగతేంటో వారికే తెలియాలి. ఆ భర్తలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్మాదైతే చేసారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు కానీ వాళ్లు వినాలి కదా..! (Woman Marry Each Other)