Divorce: ఈ మధ్యకాలంలో విడాకులు ఏ రేంజ్‌లో జరుగుతున్నాయో తెలిసిందే. సాధారణ కేసులకంటే విడాకుల కేసులే ఎక్కువైపోయాయని టాక్. పైగా ఏదో ఇద్దరూ ఒకరంటే ఒకరు నచ్చక, ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోతే అది వేరే విషయం. ఇలా అంటే కోపాలు వస్తాయి కానీ.. ఉన్న మాట చెప్పుకోవాలి.
ఈ మధ్యకాలంలో కొందరు ఆడవాళ్లు భరణం కోసం కావాలని కేసులు పెడుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇటీవల క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ విడిపోవడంతో.. కోర్టు ధనశ్రీకి రూ.4 కోట్లు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది. దాంతో ఇప్పుడు ఇది ఒక బిజినెస్ అయిపోయిందని అంటున్నారు. అబ్బాయిలు కట్నాలు తీసుకుంటూ వాటిని బహుమతులు అంటున్నారని.. అదే అమ్మాయిలు భరణం తీసుకుంటే అది రిటర్న్ గిఫ్ట్ అవుతుందని సోషల్ మీడియాలో వాదించుకుంటున్నారు.
సరే.. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. విడాకుల తర్వాత భార్యకు వేటిపై హక్కులు ఉంటాయి.. వేటిపై ఉండవు వంటి విషయాలను తెలుసుకుందాం.
భరణం లభించే అవకాశాలు ఎక్కువ. ఒకేసారి నిర్ణయించిన మొత్తం కానీ లేదన్నా నెల నెలా కొంత మొత్తాన్ని భర్త పంపిస్తూ ఉండాల్సి ఉంటుంది.
పెళ్లి సమయంలో అత్తింటివారు కానీ భర్త కానీ ఏవన్నా నగలు, కానుకలు ఇచ్చి ఉంటే అవి విడాకుల తర్వాత కూడా భార్యకే చెందుతాయి.
పెళ్లి సమయంలో భర్త కానీ అత్తింటివారు కానీ ఆమెకు ఏదన్నా ఆస్తి రాసిస్తే అది కూడా ఆమెకే దక్కుతుంది.
ఒకవేళ పెళ్లికి ముందు ఆస్తి విషయంలో కానీ ప్రాపర్టీ విషయంలో కానీ లీగల్ ఎగ్రిమెంట్ చేసుకుంటే మాత్రం దానిని బట్టి ఇద్దరికీ సమానంగా హక్కులు ఉంటాయి.
భర్తకు వారసత్వంగా వచ్చిన ఎలాంటి ఆస్తి, ప్రాపర్టీపై భార్యకు ఎలాంటి హక్కు ఉండదు
భర్త తన కష్టార్జితంలో తాను సంపాదించుకున్న ప్రాపర్టీపై భార్యకు ఎలాంటి హక్కు ఉండదు
భర్త తల్లిదండ్రులు, అతని తోబుట్టువులు, బంధువుల ఆస్తులపై భార్యకు ఎలాంటి హక్కులు ఉండవు.
ఆస్తి కానీ ప్రాపర్టీ కానీ లీగల్‌గా ఆమె పేరున రాసి ఉండకపోతే విడాకుల తర్వాత ఆ ప్రాపర్టీ నాకు కావాలి అని అడిగే రైట్ భార్యకు లేదు.