Search The Query
Search

Image
  • Home
  • News
  • Virgo: ఈ రాశిపైనే ఎందుకు న‌ర‌దిష్టి ఎక్కువ‌?

Virgo: ఈ రాశిపైనే ఎందుకు న‌ర‌దిష్టి ఎక్కువ‌?

Virgo: జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. ప్ర‌తి రాశికి ఒక ప్ర‌త్యేక‌మైన స్వ‌భావం క‌లిగి ఉంటాయి. మ‌న సంస్కృతిలో న‌ర‌దృష్టికి చాలా ప్రాముఖ్య‌త ఉంటుంది. ఎదుటి వారి విజ‌యాన్ని, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో చూసిన జీవితాన్నిచూసి ఓర్వ‌లేని వారి కంటి చూపు నుంచి వెలువ‌డే శ‌క్తి ఎదుటివారిపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని చెప్తుంటారు. కొన్ని రాశుల వారు వారి స‌హ‌జ స్వ‌భావం కార‌ణంగా ఈ దిష్టి దోషానికి తేలిక‌గా గుర‌వుతారు. అలాంటి రాశుల్లో అత్యంత ముఖ్య‌మైన‌ది క‌న్యా రాశి.

చాలా మంది క‌న్యా రాశి వారు త‌ర‌చుగా ఒకే ప్ర‌శ్న అడుగుతూ ఉంటారు. మేం ఎవ‌రి జోలికి వెళ్లం.. మా ప‌ని మేం చేసుకుంటాం.. అయినా మాకే ఎందుకు ఇన్ని ఆటంకాలు అని. మా పని మీద మా ఆరోగ్యం మీద న‌ర‌దృష్టి ఎందుకు ఎక్కువ‌గా ఉంటుంది? దీని వెన‌క కేవ‌లం జ్యోతిష్య అంశాలే కాకుండా విశ్లేష్ణ‌ణాత్మ‌క మ‌న‌స్త‌త్వానికి సంబంధించిన కార‌ణాలు ముడిప‌డి ఉన్నాయి. ఈ విష‌యాల గురించి ఈరోజు మ‌నం తెలుసుకుందాం.

క‌న్యా రాశి వారిని అర్థం చేసుకోవాలంటే వారి బుద్ధిని ప‌ని తీరుని పూర్తిగా అర్థం చేసుకోవాలి. రాశి చ‌క్రంలోని వీరు అత్యంత ఆచ‌ర‌ణాత్మ‌క‌మైన విశ్లేష్ణ‌ణాత్మ‌క‌మైన మ‌న‌సు క‌ల‌వారు. వీరి జీవితం మొత్తం ప‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఆరోగ్యం చుట్టూనే తిరుగుతుంది. భూ త‌త్వానికి చెందిన ఈ రాశి వారు ప్ర‌తి ప‌నిని ప‌రిపూర్ణంగా లోపాలు లేకుండా చేయాల‌నుకుంటారు. త‌మ బాధ్య‌త‌ల‌ను సక్ర‌మంగా నిర్వ‌ర్తిస్తారు. త‌మ ప‌నిలో నైపుణ్యం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తారు. వారి తెలివి తేట‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే విధానం ఏ విష‌యాన్నైనా లోతుగా విశ్లేషించే గుణం ఆక‌ట్టుకుంటాయి. పైకి ఇవి చాలా గొప్ప విష‌యాలుగా అనిపించినా ఇవే వారి పాలిట అతిపెద్ద స‌మ‌స్య‌గా మారుతుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక క‌న్యా రాశి వ్య‌క్తి త‌న కార్యాల‌యంలో అద్భుతంగా పూర్తి చేస్తే పై అధికారులు మెచ్చుకున్నార‌నుకోండి.. ఇది చూసిన తోటి ఉద్యోగుల్లో తెలియ‌ని అసూయ మొద‌ల‌వుతుంది.

ఈ అసూయతో కోరిన నిట్టూర్పు వారి కంటి చూపు అన్నీ క‌లిసి తీవ్ర‌మైన న‌ర‌దిష్టిగా మారి వారి జీవితంపై ఆరోగ్యంపై ప‌డుతుంది. కన్యా రాశి చిహ్నం చేతిలో ధాన్యం కంకి ప‌ట్టుకున్న క‌న్య‌గా ఉంటుంది. ఇది వారి స్వ‌చ్ఛ‌త‌ను క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే త‌త్వాన్ని ఫ‌లాల‌ను పొందే విధానాన్ని సూచిస్తుంది. క‌న్యా రాశి వారు పైకి గంభీరంగా క‌నిపించిన‌ప్ప‌టికీ.. మ‌న‌సులో నిరంత‌రం ఏదో ఒక విశ్లేష‌ణ ఆలోచ‌న ఉంటూనే ఉంటుంది. కొత్త వారితో మాట్లాడ‌టానికి కొంచెం స‌మ‌యం తీసుకుంటారు. ఆచి తూచి అడుగులు వేస్తారు. ఈ స్వ‌భావం స‌మాజంలో చాలా అపార్ధాల‌కు దారి తీస్తుంది. బ‌య‌టి వారి నిశ్శ‌బ్ధాన్ని, ప‌ని త‌త్వం చూసి ఎంత పొగ‌రు అనుకుంటారు. వారి చ‌క్క‌టి జీవన‌శైలిని, ఆరోగ్య నియ‌మాల‌ను, ఆర్ధిక ప్రణాళిక‌ల‌ను చూసి అన్నీ క‌లిసొచ్చాయని ఒక త‌క్కువ అభిప్రాయానికి వ‌స్తుంటారు.

నిజానికి వారు త‌మ జీవితాన్ని చ‌క్కదిద్దుకోవ‌డానికి ఎంతగా శ్ర‌మిస్తున్నారో అర్థం చేసుకోలేరు. ఈ అపార్ధం వ‌ల్ల పుట్టే అసూయ కూడా వారిపై దిష్టి దోషంగా ప‌నిచేస్తుంది. క‌న్యారాశికి అధిప‌తి బుధుడు. బుధుడు బుద్ధి, వాక్కు, విశ్లేష‌ణ‌, వ్యాపారానికి కార‌కుడు. ఇది భూత‌త్వ రాశి. భూమికి ఎలాగైతే స్థిర‌త్వం, ఆచ‌రాత్మ‌క‌త అనే గుణాలు ఉంటాయో అలాగే క‌న్యా రాశి వారు కూడా త‌మ చుట్టూ ఉన్న విష‌యాల‌ను చాలా ప్రాక్టిక‌ల్‌గా గ్ర‌హిస్తారు. అయితే.. వీరి విశ్లేష్ణాత్మ‌క మ‌న‌స్త‌త్వం వ‌ల్ల‌ ఎదుటి వారి నుంచి వ‌చ్చే నెగిటివ్ ఎన‌ర్జీని కూడా ఎక్కువ‌గా విశ్లేషించి అతిగా ఆలోచిస్తారు.

చిన్న విమ‌ర్శ‌ను, అసూయ‌తో కూడిన చూపును కూడా వీరి మ‌న‌సును విరిచేస్తుంది. ఈ అతి ఆలోచ‌న వారి మాన‌సిక శ‌క్తిని హ‌రించి వేస్తుంది. అందుకే చిన్న దిష్టి కూడా వీరిని మాన‌సికంగా శారీర‌కంగా ముఖ్యంగా వారి ప‌ని విష‌యంలో కుంగదీస్తుంది. క‌న్యారాశి వారిపై దిష్టి దోషం ప‌డిన‌ప్పుడు వారిలో కొన్ని ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వీరిపై ప్ర‌భావం ముఖ్యంగా వారి బుద్ధి, ఆరోగ్యం, వృత్తిపై ప‌డుతుంది.

న‌ర‌దిష్టి ప్ర‌భావం ఎలా త‌గ్గించుకోవాలి?

దీనికి కొన్ని సుల‌భ‌మైన ప‌రిహారాలు ఉన్నాయి. అవేంటంటే.. బుధునికి అధిప‌తి విష్ణువు. ప్ర‌తి బుధ‌వారం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామిని లేదా శ్రీ మ‌హా విష్ణువును తుల‌సి ద‌ళాల‌తో పూజించ‌డం చాలా మంచిది. విష్ణుస‌హ‌స్ర నామ పారాయ‌ణం చేయ‌డం వ‌ల్ల బుద్ధి స్థిరంగా ఉండి నెగిటివ్ ఎనర్జీ నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అదే విధంగా విఘ్న‌హ‌ర్త అయిన గ‌ణ‌ప‌తిని పూజించ‌డం వ‌ల్ల ప‌నుల‌లో ఆటంకాలు తొల‌గిపోతాయి. ప్రతి రోజూ ఓం భుం బుధాయ న‌మః అనే మంత్రాన్ని 108 సార్లు జ‌పించ‌డం వ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంతత‌, ఏకాగ్ర‌త పెరుగుతాయి.

క‌న్యా రాశి భూత‌త్వం రాశి కాబ‌ట్టి ప్ర‌కృతితో సంబంధం ఉన్న ప‌రిహారాలు అద్భుతంగా ప‌నిచేస్తాయి. ప్ర‌తి రోజూ ప‌చ్చ‌ని గ‌డ్డిపై చెప్పులు లేకుండా న‌డ‌వ‌డం, మొక్క‌ల‌ను పెంచ‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలోని నెగిటివ్ ఎన‌ర్జీ భూమిలోకి వెళ్లిపోతుంది. క‌న్యా రాశి వారి అదృష్ట ర‌త్నం ప‌చ్చ రాయి. ఇది బుద్ధిని చురుకుగా ఉంచి ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే.. మీ పూర్తి జాత‌కాన్ని ఒక అనుభ‌వ‌జ్ఞుడైన జ్యోతిష్యునికి చూపించి వారి స‌ల‌హా మేర‌కే ఈ రాయిని చూపించాలి. చ‌తుర్ముఖి రుద్రాక్ష బ్ర‌హ్మ స్వ‌రూపం కాబ‌ట్టి దీని వ‌ల్ల ఏకాగ్ర‌త జ్ఞాప‌క‌శ‌క్తి పెరిగి మానసిక ఒత్తిడి త‌గ్గుతుంది. మీ ఇంటిని, మిమ్మ‌ల్ని దిష్టి నుంచి కాపాడుకోవ‌డానికి ప్ర‌తిరోజు సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. 

More News

Actress Hema
Hema: న‌టి హేమ ఇంట విషాదం
BySai KrishnaNov 18, 2025

Hema: టాలీవుడ్ న‌టి హేమ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె త‌ల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం…

Actress Tulasi
Senior Actress Tulasi: సినిమాల‌కు గుడ్‌ బై
BySai KrishnaNov 18, 2025

Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన సీనియ‌ర్ న‌టి తుల‌సి యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసారు. ఈ…

SS rajamouli gets shock from producers council for the film Varanasi
Varanasi: రాజ‌మౌళికి షాక్‌.. టైటిల్ మారుస్తారా?
BySai KrishnaNov 18, 2025

Varanasi: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క వార‌ణాసి సినిమాకు ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ నుంచి షాక్ త‌గిలింది. ఈ సినిమాను…

Aadhaar card logo
Blue Aadhaar: పిల్ల‌ల ఆధార్‌ను ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలి?
BySai KrishnaNov 18, 2025

Blue Aadhaar: పిల్ల‌ల‌కు సంబంధించిన బ్లూ ఆధార్ విష‌యంలో UIDAI కీల‌క అప్డేట్ ఇచ్చింది. UIDAI బిహేవియోర‌ల్ ఇన్‌సైట్స్ లిమిటెడ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top