Kashi: జీవిత చరమాంకంలో కాశీలోనే ఉండాలని.. అక్కడే కన్నుమూయాలని కోరుకుంటారు. కాశీలో దహన సంస్కారాలు చేయలేకపోయినా.. చనిపోయిన వారి భస్మాన్ని గంగా నదిలో కలిపేస్తుంటారు. ఇలా చేస్తే చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. కాశీలోని మణికర్ణిక ఘాట్‌లో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే.. కాశీలో ఓ వింత ఆచారం ఉంది. ఇక్కడ ఎలాంటి శవాలకైనా దహన సంస్కారాలు చేస్తారు కానీ ఈ నాలుగు రకాల శవాలను మాత్రం కాల్చరట.
కాశీలో సాధువులు, సన్యాసుల మృతదేహాలను కాల్చరట. వీరి శవాలను పూడ్చడం కానీ.. లేదా గంగా నదిలో జలసమాధి కానీ చేస్తారు. అయోధ్య రామమందిర ప్రధాన అర్చకులు ఇటీవల పరమపదిస్తే.. ఆయన భౌతికకాయాన్ని కూడా గంగలో జలసమాధి చేసారు.
పన్నెండేళ్ల లోపు పిల్లల మృతదేహాలను కూడా కాల్చేందుకు ఒప్పుకోరు. వాటిని కూడా నదిలోనే పడేస్తుంటారు.
గర్భిణుల మృతదేహాలను కూడా కాల్చరు. వీరి మృతదేహాలను కూడా పూడ్చడం లేదా జల సమాధి చేయడం వంటివి చేస్తుంటారు.
పాము కాటుకు గురై చనిపోయిన వారిని కూడా కాల్చరు. అలా చనిపోయిన వారి మెదడు 21 రోజుల పాటు బతికే ఉంటుందట. కాబట్టి.. వారు ఎప్పుడో ఒకప్పుడు స్పృహ లోకి వస్తారని నమ్ముతారు. 21 రోజుల తర్వాత కూడా వారు స్పృహ లోకి రాకపోతే గంగలో పడేస్తారు. ఆ 21 రోజుల పాటు అరటి చెట్టుకి కట్టేస్తారు.