Ajit Pawar died in Chartered Flight మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు.
ఆయన ముంబై నుంచి చార్టెర్డ్ విమానంలో బారామతికి వెళ్తుండగా.. వంద అడుగుల ఎత్తు నుంచి విమానం రన్‌వేపై కూలి మంటలు చెలరేగాయి. దాంతో విమానంలో ఉన్న నలుగురు వ్యక్తులు చనిపోయారు.
దాంతో అసలు చార్టెర్డ్ విమానాలంటే ఏంటి? వీటికి సాధారణ విమానాలకు తేడా ఏంటి? వంటి విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
చార్టెర్డ్ విమానాలు వేరు.. కమర్షియల్ విమానాలు వేరు. చార్టెర్డ్ విమానాలు ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. బడా వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు వీటికి ఎక్కువగా వాడుతుంటారు.
చార్టర్డ్ విమానాలు తేలికగా ఉంటాయి. ఎక్కువ గాలి, కుదుపు, వర్షాలను తట్టుకోలేవు. అదే కమర్షియల్ విమానాలు కాస్త బరువుగా ఉంటాయి కాబట్టి తట్టుకుని నిలబడతాయి.
చార్టర్డ్ విమానాల్లో బ్యాకప్ సిస్టమ్స్ తక్కువ. కమర్షియల్ విమానాల్లో ఎక్కువగా ఉంటాయి. కమర్షియల్ విమానాల పైలట్లు కొన్ని అత్యవసర సందర్భాల్లో వేరే ఎయిర్‌పోర్ట్‌లకు డైవర్ట్ అయ్యేలా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు.
చార్టెర్డ్ విమానాల పైలట్లకు ఎక్కడికి వెళ్లాలో అక్కడే దించాల్సిన పరిస్థితి. వీరికి ఆలోచించుకుని ల్యాండ్ చేసే సమయం కూడా ఉండదు. అందుకే చార్టర్డ్ విమానాల్లో ప్రయాణం రిస్క్‌తో కూడుకున్నది.
గత ఆరు నెలల్లో దాదాపు ఐదు, ఆరు చార్టెర్డ్ విమానాలు కూలిన ఘటనలు ఉన్నాయి.





