Benjamin Netanyahu ఇజ్రాయల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహు ఫోన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆయన ఫోన్ వెనకున్న కెమెరాకు టేప్ అంటించి ఉంది.
ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్ ప్రాంగణంలో ఆయన కారు ఎక్కుతూ ఫోన్ మాట్లాడుతుండగా మీడియా వర్గాలు ఫోటోలు క్లిక్‌మనిపించాయి.
ఆ సమయంలో ఆయన ఫోన్ కెమెరాకు ఎర్ర టేపు అంటించి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కేవలం సాధారణ టేప్ కాదు. సెక్యూరిటీ స్టిక్కర్.
అత్యధిక సెక్యూరిటీ జోన్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే పరికరాలకు ఈ స్టిక్కర్లను వాడతారు. ఇలా సెక్యూరిటీ స్టిక్కర్ ఉంటే ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీసేందుకు అనుమతి ఉండదు. ఎలాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాదు.
అడ్వాన్స్డ్ సర్వైలెన్స్ సెక్యూరిటీకి పెట్టింది పేరు ఇజ్రాయెల్. అందుకే అక్కడి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల పరికరాలకు అధిక సెక్యూరిటీ ఉంటుంది.





